AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Thalapathy: నీకు 50 ఏళ్లంటే ఎలా నమ్మేది.. అమ్మాయిల కలల రాకూమారుడు విజయ్ దళపతి..

విజువల్ కమ్యూనికేషన్ కోర్సు సగంలోనే వదిలేసి సినీరంగంలోకి అడుగుపెట్టాడు విజయ్. అమ్మ శోభ స్క్రీన్ ప్లేతో హీరోగా పరిచయం అయ్యాడు. తండ్రి దర్శకత్వం వహించిన రేపటి తీర్పు సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఈ సినిమా అంతగా ఆకట్టుకోకపోవడంతో.. సెంటూరపాండి సినిమాలో నటించాడు.

Vijay Thalapathy: నీకు 50 ఏళ్లంటే ఎలా నమ్మేది.. అమ్మాయిల కలల రాకూమారుడు విజయ్ దళపతి..
Vijay Thalapathy
Rajitha Chanti
|

Updated on: Jun 22, 2024 | 10:52 AM

Share

జోసెఫ్ విజయ్.. ఇలా చెప్పడం కంటే దళపతి విజయ్ అంటేనే సినీ ప్రియులకు అర్థమవుతుంది. చిన్నవయసులోనే నటుడిగా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలు.. మరెన్నో వైవిధ్యమైన పాత్రలతో అడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.150 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి చేరుకున్నాడు. తమిళంలోనే కాకుండా ఈ హీరోకు తెలుగులోనూ భారీ క్రేజ్ ఉంది. ముఖ్యంగా విజయ్ దళపతికి అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే ఉంటుంది. ఇన్నాళ్లు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరించిన విజయ్.. ఇప్పుడు ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇటీవలే సొంతంగా పార్టీ స్థాపించి నేరుగా ప్రత్యేక్ష రాజకీయాల్లోకి వెళ్లారు. ఈరోజు విజయ్ దళపతి పుట్టిన రోజు. నేటితో 50వ వసంతంలోకి అడుగుపెడుతున్న దళపతికి అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

విజయ్.. జూన్ 22, 1974న చెన్నైలో ప్రముఖ సినీ దర్శకుడు SA చంద్రశేఖర్, గాయని శోభ దంపతులకు జన్మించారు. సామాజిక అంశాలతో సంచలన దర్శకుడిగా ఎస్.ఎ. చంద్రశేఖర్ వెలుగొందుతున్న తరుణంలో వెట్రి, నాన్ రెడ్డ్ మన్మన్, ఖట్టమ్ ఈఓర్ ఉరులన్ వంటి చిత్రాలతో విజయ్ ని బాలనటుడిగా పరిచయం చేశారు. సినిమా కుటుంబం కావడంతో విజయ్‌కి చిన్నతనంలోనే సినిమాలపైనా, సినీ పరిశ్రమపైనా ఆసక్తి పెరిగింది. విజువల్ కమ్యూనికేషన్ కోర్సు సగంలోనే వదిలేసి సినీరంగంలోకి అడుగుపెట్టాడు విజయ్. అమ్మ శోభ స్క్రీన్ ప్లేతో హీరోగా పరిచయం అయ్యాడు. తండ్రి దర్శకత్వం వహించిన రేపటి తీర్పు సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఈ సినిమా అంతగా ఆకట్టుకోకపోవడంతో.. సెంటూరపాండి సినిమాలో నటించాడు.

తండ్రి దర్శకత్వంలో అనేక చిత్రాల్లో నటించిన విజయ్.. నటుడిగానే కాకుండా కమర్షియల్ హీరోకి కావాల్సిన డ్యాన్స్, యాక్షన్ నేర్చుకుంటూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. 1996లో పూవే ఉనకక్క సినిమాతో హీరోగా విజయ్ కెరీర్ మారింది. దీంతో విజయ్ ఫాలోయింగ్ పెరిగింది. ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించారు. హీరోగా స్టార్ డమ్ ఇవ్వడమే కాదు.. పూవే ఉనకక్క వ్యక్తిగత జీవితాన్ని మలుపు తిప్పింది. శ్రీలంకలోని జాఫ్నాకు చెందిన సంగీత లండన్ లో చదువుకుంటున్న సమయంలో పూవే ఉనకక్క సినిమా చూసి విజయ్ వీరాభిమానిగా మారింది. మొదట అభిమానిగా పరిచయమై స్నేహితురాలిగా, ప్రియురాలిగా, భార్యగా మారి లండన్ నుంచి చెన్నైలో సెటిల్ అయ్యింది. 1999 ఆగస్ట్ 25న వీరిద్దరి వివాహం జరిగింది.

మ్యారెజ్ తర్వాత విజయ్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా మారింది సంగీత. విజయ్ సినిమాలన్నింటికి సంగీత కాస్ట్యూమ్స్ ఎంపిక చేసింది. విజయ్ దళపతి కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. ఏజే సూర్య తెరకెక్కించిన ఖుషి సినిమాతో విజయ్ ఇమేజ్ మరింత పెరిగింది. అలాగే మహేష్ బాబు నటించిన పోకిరి చిత్రాన్ని రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టాడు. కత్తి, తేరి, మెర్సల్, బిగిల్ వంటి హిట్ చిత్రాలను అందుకున్నాడు. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు అభిమానుల కోసం సామాజిక సంక్షేమం కోసం ఆలోచించి అనేక కార్యక్రమాలు చేశారు. గతేడాది పదవ తరగతి, ఇంటర్ పరీక్షలలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు జిల్లా స్థాయి విద్యార్థులకు వేర్వేరుగా వేడుకలు నిర్వహించి బహుమతులు అందించాడు. ఇటీవల త‌మిళ‌క వెట్రి క‌జ‌గం అనే పొలిటిక‌ల్ పార్టీని స్థాపించిన విజయ్.. ఇప్పటివరకు తాను కమిట్ అయిన సినిమాలు తప్ప మరే సినిమాల్లో నటించనని ప్రకటించాడు. 2026 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా పెట్టుకుని తన అభిమానులు, ఫోరమ్ నిర్వాహకులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.