AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: నిశీధిని అల్లేసుకున్న వయ్యారి.. చిరంజీవి చెల్లిగా నటించిన హీరోయిన్.. గుర్తుపట్టగలరా..?

నటిగా ప్రశంసలు అందుకున్నా.. మంత్రముగ్దులను చేసే అందమైన రూపమైన హీరోయిన్‏గా అవకాశాలు తక్కువగా వస్తుంటాయి. అందులో ఈ హీరోయిన్ ఒకరు. పైన ఫోటోను చూశారు కదా.. నిశీధిని అల్లేసుకున్నట్లు కనిపిస్తున్న ఆ వయ్యారి దక్షిణాది ప్రేక్షకులకు సుపరిచితమే. కథానాయికగా అంతగా పాపులర్ కాలేదు.. కానీ ఓ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చెల్లిగా కనిపించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.. ?

Tollywood: నిశీధిని అల్లేసుకున్న వయ్యారి.. చిరంజీవి చెల్లిగా నటించిన హీరోయిన్.. గుర్తుపట్టగలరా..?
Actress
Rajitha Chanti
|

Updated on: Jun 22, 2024 | 11:12 AM

Share

సినీ పరిశ్రమలో గుర్తింపు రావాలంటే అందం, అభినయం మాత్రమే కాదు అదృష్టం కూడా ఉండాల్సిందే. ఫిల్మ్ బ్యాగ్రౌండ్ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా అంతగా పాపులర్ మాత్రం కాలేరు కొంతమంది. నటిగా ప్రశంసలు అందుకున్నా.. మంత్రముగ్దులను చేసే అందమైన రూపమైన హీరోయిన్‏గా అవకాశాలు తక్కువగా వస్తుంటాయి. అందులో ఈ హీరోయిన్ ఒకరు. పైన ఫోటోను చూశారు కదా.. నిశీధిని అల్లేసుకున్నట్లు కనిపిస్తున్న ఆ వయ్యారి దక్షిణాది ప్రేక్షకులకు సుపరిచితమే. కథానాయికగా అంతగా పాపులర్ కాలేదు.. కానీ ఓ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చెల్లిగా కనిపించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ తాన్యా రవిచంద్రన్. ప్రముఖ నటుడు రవిచంద్రన్ మనవరాలు. ఆయన వారసత్వంతోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది తాన్యా. చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రంలో నయనతార చెల్లిగా కనిపించింది.

పాలే విల్లయతేవా సినిమాతో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమైంది. 2017లో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే కథానాయికగా తాన్యాకు పాపులారిటీని తీసుకువచ్చింది. ఆ తర్వాత ఈ వయ్యారికి బృందావనం, కరుప్పన్, నెంచుకు నీతి, మాయోన్, అఖిలన్ వంటి హిట్ చిత్రాల్లో ఆఫర్ వచ్చింది. ఇక కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన కరుప్పన్ సినిమాలో హీరోయిన్‌గా నటించిన క్రేజ్ సొంతం చేసుకుంది. అయితే తాన్యాకు ఊహించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ఓవైపు సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ బ్యూటీ తెలుగులో మాత్రం సైడ్ క్యారెక్టర్స్ పోషించింది.

ఇటీవలే రసవాది సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. ఇన్నాళ్లు హోమ్లీగా కనిపించిన తాన్యా.. ఇప్పుడు నెట్టింట గ్లామర్ లిమిట్స్ చేరిపేసింది. ఇప్పుడిప్పుడే మోడ్రన్ లుక్ లో గ్లామర్ ఫోజులతో ఫాలోవర్స్ మతిపోగొట్టేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన బ్లాక్ అండ్ వైట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దీంతో అవకాశాల కోసమే ఇప్పుడు తాన్యా గ్లామర్ డోస్ పెంచిందని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు