Ram Charan Rangasthalam: మే నెలలో విడుదల కానున్న రంగస్థలం సినిమా.. పెద్ద ఎత్తున డిమాండ్ రావడమే కారణం..
Ram Charan Rangasthalam: రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగస్థలం' చిత్రం ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2018లో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డును నెలకొల్పింది..
Ram Charan Rangasthalam: రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగస్థలం’ చిత్రం ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2018లో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డును నెలకొల్పింది. అప్పటి వరకు స్టైలిష్ లుక్‌లో కనిపించిన రామ్ చరణ్ ఈ సినిమాలో పూర్తిగా మాస్ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా కెరీర్‌లో తొలిసారి ఓ ఛాలెంజింగ్ పాత్రలో నటించాడు చెర్రీ. చెవిటి వ్యక్తి పాత్రలో నటించిన రామ్ చరణ్ విమర్శకుల సైతం ప్రశంసలు అందుకున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా మే నెలలో విడుదలకు సిద్ధమవుతోంది. అదేంటి ఆల్ రడీ విడుదలైన సినిమా మళ్లీ ఎందుకు రిలీజ్ అవుతుందనేగా మీ సందేహం. అయితే ఈ సారి తెలుగులో కాదులేండి తమిళంలో.. రామ్ చరణ్ పుట్టిన రోజు (శనివారం) సందర్భంగా అతను నటిస్తోన్న చిత్రాలకు సంబంధించిన పలు అప్‌డేట్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఓ ప్రకటన చేసింది. రంగస్థలం చిత్రాన్ని తమిళంలో విడుదల చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో మే నెలలో విడుదలకు ముహూర్తం ఖరారు చేసినట్లు మైత్రీ మూవీ మేకర్స్.. ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. మరి తెలుగులో సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న ఈ సినిమా తమిళంలో ఏమేర రాణిస్తుందో చూడాలి. రంగస్థలం చిత్రంలో రామ్ చరణ్ సరసన సమంత నటించగా.. ఆది పినిశెట్టి, ప్రకాశ్ కీలక పాత్రలో నటించారు. పల్లెటూరు నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టిన విషయం తెలిసిందే.
మైత్రీ మూవీ మేకర్స్ చేసిన ట్వీట్..
Wishing our Mega Power Star a great day! #HappyBirthdayRamcharan
Due to Popular demand by all #RamCharan Tamil Fans.. We are releasing Blockbuster Rangasthalam (Tamil) in Theatres this MAY 2021.. Release thru @7GfilmsSiva@AlwaysRamCharan @Samanthaprabhu2 @ThisIsDSP @aryasukku pic.twitter.com/TIaYiZtgH5
— Mythri Movie Makers (@MythriOfficial) March 27, 2021
Actress Anjali: నేను రూల్స్ విధిగా పాటిస్తాను.. ట్రాఫిక్ అవగాహన కార్యక్రమంలో హీరోయిన్ అంజలి