Ram Charan : పొలిటికల్ థ్రిల్లర్ గా శంకర్ సినిమా.. ముఖ్యమంత్రిగా రామ్ చరణ్.. చక్కర్లు కొడుతున్న వార్త
మెగాపవర్ స్థార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ తో బిజీ బిజీగా ఉన్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నాడు.
Ram Charan : మెగాపవర్ స్థార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ తో బిజీ బిజీగా ఉన్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతోపాటు మెగాస్టార్ నటిస్తున్న ఆచార్య సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు చరణ్. ఈ సినిమాలో చిరంజీవి, చరణ్ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. ఈ సినిమాల తర్వాత స్టార్ డైరెక్టర్ శంకర్ తో సినిమా చేస్తున్నాడు.
శంకర్, చరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కు ఇది 50వ సినిమా అలాగే చరణ్ కెరియర్ లో ఇది 15వ సినిమా. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో నిర్మాతలు దిల్ రాజు- శిరీష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే ఈ సినిమా ఎలా ఉండబోతుందన్నదానిపైన చర్చ మొదలైంది. తాజాగా ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోందని తెలుస్తుంది. ఇక ఈ మూవీలో చరణ్ ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడని టాక్ నడుస్తుంది. శంకర్ తరహాలో సందేశాత్మక అంశాలతో భారీ స్థాయిలో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ మూవీ రూపొందనుందట. మరి ఈ సినిమాలో నిజంగా చరణ్ ముఖ్యమంత్రిగా కనిపిస్తాడా లేదా అన్నది తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే. ఇక రామ్చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆచార్య సినిమానుంచి అలాగే ఆర్ఆర్ఆర్ నుంచి చరణ్ లుక్ ను రిలీజ్ చేశారు. ఆ ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
మరిన్ని ఇక్కడ చదవండి :
Actress Anjali: నేను రూల్స్ విధిగా పాటిస్తాను.. ట్రాఫిక్ అవగాహన కార్యక్రమంలో హీరోయిన్ అంజలి