RRR Movie Ram Charan: అల్లూరి సీతారామరాజు పాత్ర కోసం రామ్ చరణ్ కష్టాలు.. మేకోవర్ వీడియో అదుర్స్..
జక్కన్న తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కోసం యావత్ దేశవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చరిత్రలో
జక్కన్న తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కోసం యావత్ దేశవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చరిత్రలో ఎప్పుడు కలవని ఇద్దరు వీరుల మధ్య స్నేహాన్ని జక్కన్న ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా చూపించబోతుండడంతో ఈ మూవీ కోసం ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. ఇందులో స్టార్ హీరో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో పోషిస్తుండడంతో మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. సినీ ఇండస్ట్రీలో రాజమౌళి చేసే మ్యాజిక్ కోసం సినీ ప్రముఖులు.. ప్రేక్షకులు అంతా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసురానున్నారు. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. గత కొద్ది రోజులుగా ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌లో జక్కన్నతోపాటు.. రామ్ చరణ్, తారక్ కూడా పాల్గోంటున్నారు.
ఇదిలా ఉంటే.. విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో సినిమా నుంచి వరుస అప్డేడ్స్ ఇస్తూ తారక్, చరణ్ అభిమానులను ఖుషి చేస్తున్నారు రాజమౌళి. ఇప్పటికే తారక్ నటిస్తోన్న కొమురం భీమ్ మేకోవర్ వీడియో విడుదల చేసిన రాజమౌళి.. తాజాగా చరణ్ పోషిస్తున్న అల్లూరి సీతారామరాజు పాత్రకు సంబంధించిన మేకోవర్ వీడియోను విడుదల చేశారు. ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్ర కోసం చరణ్ పడిన కష్టాన్ని చూపించారు జక్కన్న. అలాగే అలియాతో చరణ్ ముచ్చట్లు… కెమెరా వెనక రామ్ చరణ్ ప్రాక్టీస్ సన్నివేశాలను చూపించారు. ఈ వీడియోకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఇలా తమ అభిమాన హీరోలకు సంబంధించిన మేకోవర్ వీడియోలను విడుదల చేయడంతో తారక్, చరణ్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.
ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తుండగా.. అలియా భట్, ఒలివియా, అజయ్ దేవగణ్, శ్రియ కీలక పాత్రలలో నటిస్తున్నారు.
View this post on Instagram
Samantha: ఇలా కనిపించాలంటే మాత్రం హార్డ్‌వర్క్ కంపల్సరీ.. మరోసారి హాట్ కామెంట్స్ చేసిన సమంత..