Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: గేమ్ ఛేంజర్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. చెర్రీ కోసం శంకర్ మరో బిగ్ ప్లాన్..

ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నటిస్తోన్న సినిమా కావడంతో గేమ్ ఛేంజర్ పై భారీగానే అంచనాలు ఉన్నాయి. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ తాత్కలికంగా బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు.

Ram Charan: గేమ్ ఛేంజర్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. చెర్రీ కోసం శంకర్ మరో బిగ్ ప్లాన్..
Game Changer
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 12, 2023 | 5:27 PM

ట్రిపుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ సంపాదించుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ చిత్రంతో గ్లోబల్ స్టార్ గా మారిన చెర్రీ.. ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నటిస్తోన్న సినిమా కావడంతో గేమ్ ఛేంజర్ పై భారీగానే అంచనాలు ఉన్నాయి. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ తాత్కలికంగా బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ చివరి దశలో ఉంది. గతంలో విడుదలైన గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ రాగా.. ఇక ఈ సినిమా అప్డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ వెయిట్ కళ్లతో ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాలో చరణ్ రెండు పాత్రలలో కనిపించబోతున్నారు. అందులో ఒకటి ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర కాగా.. మరొకటి రాజకీయ నాయకుడిది. ఇప్పటికే ఈ సినిమా గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. తాజాగా ఇప్పుడు మరో ఆసక్తికర వార్త నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో చరణ్ ఏకంగా ఏడు గెటప్స్ లో కనిపించబోతున్నాడట. సాధారణంగా శంకర సినిమాల్లో హీరోస్ రకరకాల లుక్స్ లో కనిపించడం జరుగుతుంది. సన్నివేశాలతోపాటు పాటల్లో హీరోలను డిఫరెంట్ లుక్స్ లో ప్రెజెంట్ చేయడం ఆయన స్టైల్. ఇక ఇప్పుడు గేమ్ ఛేంజర్ విషయంలోనూ తన మార్క్ చూపించబోతున్నాడట.

గేమ్ ఛేంజర్ సినిమాలో చరణ్ ఏకంగా ఏడు లుక్స్ లో కనిపిస్తాడని తెలుస్తోంది. ఐఏఎస్, రాజకీయ నాయకుడి పాత్రలతోపాటు.. మిడిల్ ఏజ్ లుక్ లోనూ కనిపిస్తాడని తెలుస్తోంది. మరో నాలుగు గెటప్స్ కథలో భాగామా ?.. లేదా పాటల్లో వస్తాయా ? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ సినిమా క్లైమాక్స్ సీన్స్ షూటింగ్ ఇటీవలే పూర్తికాగా.. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇందులో జయరామ్, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర కీలకపాత్రలు పోషిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బెంగళూరులో దారుణం.. ఇద్దరు యువతులను వెంబడించిన వ్యక్తి..
బెంగళూరులో దారుణం.. ఇద్దరు యువతులను వెంబడించిన వ్యక్తి..
వాషింగ్టన్ అవుట్ పైవివాదం
వాషింగ్టన్ అవుట్ పైవివాదం
అదితి రావు హైదరీ సంచలన కామెంట్స్..
అదితి రావు హైదరీ సంచలన కామెంట్స్..
మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్‌లో అవకాడో తింటే కలిగే ప్రయోజనాలు తెలిస్తే
మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్‌లో అవకాడో తింటే కలిగే ప్రయోజనాలు తెలిస్తే
చాన్నాళ్ళకు ఫ్యాన్స్ ముందుకు తారక్.. ఏమి మాట్లాడారంటే.?
చాన్నాళ్ళకు ఫ్యాన్స్ ముందుకు తారక్.. ఏమి మాట్లాడారంటే.?
స్టాక్ మార్కెట్లో గందరగోళం.. 5 నిమిషాల్లోనే 19 లక్షల కోట్లు అవిరి
స్టాక్ మార్కెట్లో గందరగోళం.. 5 నిమిషాల్లోనే 19 లక్షల కోట్లు అవిరి
నా కొడుకు ఏ తప్పు చేయలేదు.. ఐటీ దర్యాప్తుపై పృథ్వీరాజ్ తల్లి కామె
నా కొడుకు ఏ తప్పు చేయలేదు.. ఐటీ దర్యాప్తుపై పృథ్వీరాజ్ తల్లి కామె
వైట్‌ రైస్‌కి బదులుగా ఓట్స్‌ తింటున్నారా..? ఏమౌతుందో తెలుసుకోవడం
వైట్‌ రైస్‌కి బదులుగా ఓట్స్‌ తింటున్నారా..? ఏమౌతుందో తెలుసుకోవడం
అమెరికాలో లక్షల్లో జీతం.. పవన్ కళ్యా్ణ్ సినిమాలో ఛాన్స్ రావడంతో..
అమెరికాలో లక్షల్లో జీతం.. పవన్ కళ్యా్ణ్ సినిమాలో ఛాన్స్ రావడంతో..
తక్కువ పెట్టుబడి..ఇంటి నుండే పొటాటో చిప్స్ తయారీ.. రెట్టింపు లాభం
తక్కువ పెట్టుబడి..ఇంటి నుండే పొటాటో చిప్స్ తయారీ.. రెట్టింపు లాభం