Ajith Kumar: అమ్మను మించిన అందంతో అజిత్ కూతురు.. హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా ఉందిగా..
అజిత్ మాత్రమే కాదు.. ఆయన సతీమణి అలనాటి హీరోయిన్ షాలిని సైతం సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా ఉండరు. ఇటీవలే షాలిని ఇన్ స్టాలో ఖాతా ఓపెన్ చేసింది. తాజాగా అందులో తన ఫ్యామిలీ లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోస్ నెట్టింట వైరలవుతుంది.

తమిళ్ స్టార్ హీరో అజిత్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు ఆయన. సినీ పరిశ్రమలలో ప్రస్తుతం ఉన్న నటీనటులలో అజిత్ శైలి చాలా ప్రత్యేకం. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో స్టార్స్ అందరూ ఫుల యాక్టివ్ గా ఉంటూ తమ అభిమానులతో టచ్ లో ఉండగా.. నేటికీ అజిత్ ఇంటర్నెట్ ప్రపంచానికి దూరంగా ఉంటారు. షూటింగ్స్ నుంచి గ్యాప్ దొరికితే చాలు.. బైక్ రైడింగ్ చేస్తుంటారు. అజిత్ కుటుంబానికి సంబంధించిన ఫోటోస్ మాత్రం ఎప్పటికప్పుడు నెట్టింట షేర్ చేస్తుంటారు ఆయన ఫ్యాన్స్. అజిత్ మాత్రమే కాదు.. ఆయన సతీమణి అలనాటి హీరోయిన్ షాలిని సైతం సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా ఉండరు. ఇటీవలే షాలిని ఇన్ స్టాలో ఖాతా ఓపెన్ చేసింది. తాజాగా అందులో తన ఫ్యామిలీ లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోస్ నెట్టింట వైరలవుతుంది.
తాజాగా షాలిని షేర్ చేసిన ఫోటోలలో ఆమె కూతురు అనౌష్క స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. అజిత్ పక్కనే నిల్చునన అనౌష్క ఎంతో అందంగా చూడముచ్చటగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. 1999లో అమర్కలం సినిమా షూటింగ్ సమయంలో అజిత్ ,షాలిని ప్రేమలో పడ్డారు. ఈ సినిమాలోని ఓ సన్నివేశం చిత్రీకరిస్తుండగా.. అజిత్ అనుకోకుండా షాలిని చేతిని కట్ చేశారు. దీంతో ఆమె గాయపడింది. ఆ తర్వాత షాలిని తన గాయాన్ని పట్టించుకోలేదు.కానీ అజిత్ మాత్రం చాలా ఇబ్బందిపడ్డాడు. షాలిని గాయం నయమయ్యేవరకు ఆమెను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు.
View this post on Instagram
అదే సమయంలో అజిత్ తో ప్రేమలో పడింది షాలిని. వీరిద్దరు 2000 ఏప్రిల్ లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత షాలిని సినిమాలకు పూర్తిగా దూరమయ్యింది. జీవితంలో తాను కుటుంబానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తానని.. ప్రస్తుతం తాను ఎంతో ప్రశాంతంగా ఉన్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది షాలిని.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి