Bigg Boss 7 Telugu: ఆ పది మంది మాత్రం ఫిక్స్.. బిగ్‌బాస్ సీజన్ 7.. ఈసారి రచ్చే ఇక..
సెప్టెంబర్ నెలలో ఈ షో స్టార్ట్ కాబోతుంది. మరోవైపు నెట్టింట బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ ఓ లిస్ట్ కూడా చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే పలు ప్రోమోస్ రివీల్ చేస్తూ.. ఎప్పటికప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. న్యూ గేమ్, న్యూ రూల్స్.. న్యూ ఛాలెంజెస్ అంటూ చెప్పుకొచ్చిన నాగ్.. ఇటీవల ఇక అంతా ఉల్టా పల్టానే అని చెప్పేశారు. దీంతో ఈసారి గేమ్ మాత్రం సరికొత్తగా ఉండబోతుందని తెలుస్తోంది.

బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్. ఈ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగుతోపాటు, హిందీ, తమిళం, మలయాళం ఇలా అన్ని భాషల్లోనూ విజయవంతంగా రన్ అవుతుంది. తెలుగులో ఇప్పటికే ఆరు సీజన్స్ విజయవంతంగా పూర్తిచేసుకుని ఇప్పుడు ఏడో సీజన్‌కు రెడీ అవుతుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే లోగో విడుదల చేస్తూ ప్రోమో కూడా షేర్ చేశారు. ఇక ఎప్పటిలాగే ఈ సీజన్ కు కూడా నాగార్జున హోస్ట్ చేయనున్నారు. సెప్టెంబర్ నెలలో ఈ షో స్టార్ట్ కాబోతుంది. మరోవైపు నెట్టింట బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ ఓ లిస్ట్ కూడా చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే పలు ప్రోమోస్ రివీల్ చేస్తూ.. ఎప్పటికప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. న్యూ గేమ్, న్యూ రూల్స్.. న్యూ ఛాలెంజెస్ అంటూ చెప్పుకొచ్చిన నాగ్.. ఇటీవల ఇక అంతా ఉల్టా పల్టానే అని చెప్పేశారు. దీంతో ఈసారి గేమ్ మాత్రం సరికొత్తగా ఉండబోతుందని తెలుస్తోంది.
కొద్దిరోజులుగా నెట్టింట పలువురు ఫేమస్ సెలబ్రెటీల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. అందులో పది మంది మాత్రం ఖరారు అయినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట వైరలవుతుంది. ఇక ఈసారి కామన్ మ్యాన్ గా సోషల్ మీడియాలో ఇన్ ఫ్లూయెన్సర్ యువ సామ్రాట్ ఓ కంటెస్టెంట్ గా ఖరారు అయినట్లుగా తెలుస్తోంది. అతను టిక్ టాక్ వీడియోస్, రీల్స్ తెగ పాపులర్ అయ్యాయి. అతనికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అలాగే మొగలి రేకులు సీరియల్ హీరో ఆర్కే నాయుడు అలియాస్ సాగర్ సైతం ఫిక్స్ అయినట్లుగా టాక్. అలాగే బుల్లెట్ భాస్కర్. ఈ పేరు తెలియని వారుండరు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఫేమస్ అయ్యాడు. ఈసారి బిగ్ బాస్ సీజన్ 7లోకి అడుగుపెడుతున్నారని తెలుస్తోంది.
View this post on Instagram
అలాగే కార్తీక దీపం ఫేమ్ మోనిత.. అలియాస్ శోభా శెట్టి పేరు ముందు నుంచి వినిపిస్తోంది. కార్తీక దీపం సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది శోభా. అచ్చు తెలుగు యాంకర్ విష్ణుప్రియకు నెట్టింట విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ బ్యూటీ కూడా ఈసారి బిగ్ బాస్ లోకి అడుగుపెట్టబోతుంది. ఇటీవలే బేబీ సినిమాతో హీరోయిన్ గా సూపర్ హిట్ అందుకున్న వైష్ణవి బిగ్ బాస్ లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది.
View this post on Instagram
View this post on Instagram
నవ్యస్వామి.. ఇటీవల బుట్టా బొమ్మ, ఇంటింటి రామాయణం సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ భామా కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్ అని తెలుస్తోంది. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి.. ఆమె కూతురు సుప్రియతో కలిసి వెళ్లబోతుందట. ఇక బుల్లెట్టు బండి పాటతో ఫేమస్ అయిన ఫోక్ సింగర్ మోహన భోగరాజు, టీవీ నటుడు ప్రభాకర్, యాంకర్ దీపికా పిల్లి, యూట్యూబర్ దుర్గారావు కపుల్ ఈసారి బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొనబోతున్నారట. ఇక మరికొంతమంది యంగ్ హీరోయిన్స్, సింగర్స్ కూడా ఈసారి బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లబోతున్నారట.
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




