Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖానికి గాయం.. పదిరోజులు రెస్ట్ !

ముఖానికి గాయం అవ్వడంతో ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారట చరణ్. గాయంమానిన తర్వాత గేమ్ చెంజర్ సినిమా షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది. ముఖానికి గాయం కావడంతో ఇంట్లోనే ప్రధమిక చికిత్స అందిస్తున్నారట. అయితే పది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు తెలిపినట్టు నమాచరం. అయితే రామ్ చరణ్ కు గాయమైనట్టు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ దంపతులు ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖానికి గాయం.. పదిరోజులు రెస్ట్ !
Ram Charan Photo
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 25, 2023 | 12:56 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గాయపడ్డారని తెలుస్తోంది. రామ్ చరణ్ మొఖానికి గాయమైందని సమాచారం. ప్రస్తుతం గేమ్ చెంజర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు చరణ్. అయితే రామ్ చరణ్ కు ఇంట్లోనే గాయం అయ్యిందని తెలుస్తోంది. ముఖానికి గాయం అవ్వడంతో ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారట చరణ్. గాయంమానిన తర్వాత గేమ్ చెంజర్ సినిమా షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది. ముఖానికి గాయం కావడంతో ఇంట్లోనే ప్రధమిక చికిత్స అందిస్తున్నారట. అయితే పది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు తెలిపినట్టు నమాచరం. అయితే రామ్ చరణ్ కు గాయమైనట్టు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ దంపతులు ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

చరణ్ ప్రస్తుతం టాప్ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు. ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తగా క్రేజ్ తెచ్చుకున్న చరణ్. ఇప్పుడు గేమ్ చెంజర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. పలు కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.

అలాగే ఈ సినిమా శ్రీకాంత్, సునీల్, అంజలి, ఎస్ జే సూర్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రామ్ చరణ్ ఈ సినిమాలో రెండు పాత్రల్లో కనిపించనున్నారట. డ్యూయల్ రోల్ లో చరణ్ అదరగొడతారని సమాచారం. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో సినిమా చేస్తున్నారు చరణ్. ఇక ఇప్పుడు చరణ్ కు గాయం కావడంతో సినిమా షూటింగ్ మరో పదిరోజులు వాయిదా వేయనున్నారు. చరణ్ పూర్తిగా కోలుకున్న తర్వాతే ఈ మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభించనున్నారు. అయితే చరణ్ కు గాయం కావడం పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

రామ్ చరణ్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్

రామ్ చరణ్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.