Tollywood : సోషల్ మీడియా సిత్రాలు.. ఓ వైపు ఐస్ బాత్ చేస్తూ విజయ్ దేవరకొండ.. మరో వైపు మీనాక్షి మెరుపులు
భారీ అంచనాలు పెట్టుకున్న లైగర్ డిజాస్టర్ అయ్యింది. మినిమమ్ గ్యారెంటీ అనుకున్న ఖుషి సినిమా కూడా యావరేజ్ తో సరిపెట్టుకుంది. దాంతో విజయ్ నెక్స్ట్ సినిమా కోసం ఆయన అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు విజయ్. తన సినిమా వివరాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటాడు. తాజాగా ఐస్ బాత్ చేస్తోన్న ఫోటోను సోషల్ మీడియాలో వదిలాడు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సాలిడ్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత గీతగోవిందం లాంటి డీసెంట్ హిట్ అందుకున్నాడు విజయ్. ఆతర్వాత మనోడు హిట్ రుచిచూడలేదు. భారీ అంచనాలు పెట్టుకున్న లైగర్ డిజాస్టర్ అయ్యింది. మినిమమ్ గ్యారెంటీ అనుకున్న ఖుషి సినిమా కూడా యావరేజ్ తో సరిపెట్టుకుంది. దాంతో విజయ్ నెక్స్ట్ సినిమా కోసం ఆయన అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు విజయ్. తన సినిమా వివరాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటాడు. తాజాగా ఐస్ బాత్ చేస్తోన్న ఫోటోను సోషల్ మీడియాలో వదిలాడు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
View this post on Instagram
అందాల భామ మీనాక్షి చౌదరి ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారింది. నిన్నమొన్నటి వరకు చిన్న సినిమాలతో సరిపెట్టుకున్న ఈ చిన్నది. ఇప్పుడు ఒకేసారి మహేష్ బాబు సినిమాలో ఛాన్స్ అందుకొని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది మీనాక్షి చౌదరి. అలాగే వరుణ్ తేజ్ సరసన ఓ సినిమాలో నటిస్తుంది. అదే విధంగా దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న లక్కీ లక్ష్మణ్ సినిమాలోనూ నటిస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
బిగిల్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించి మెప్పించింది అందాల భామ అమృత అయ్యర్. బిగిల్ సినిమాలో ఫుట్ బాల్ టీమ్ మెంబర్ గా నటించింది. ఆతర్వాత తెలుగులో పలు సినిమాల్లో మెరిసింది. రెడ్, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా లాంటి సినిమాల్లో కనిపించింది. సోషల్ మీడియాలో అమృత తాజాగా ఓ ఫోటోను షేర్ చేసింది. బ్లాక్ కలర్ డ్రస్ లో గ్లామర్ తో ఆకట్టుకుంటుంది.
View this post on Instagram
దక్ష నాగర్కర్ లేటెస్ట్ ఇన్ స్టా పోస్ట్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.