AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: ‘ఆచార్య’కు బాయ్‌ బాయ్‌… ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’కు హాయ్‌… షూటింగ్‌కు ప్యాకప్‌ చెప్పిన మెగా పవర్‌ స్టార్‌..

Ram Charan: కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్‌ చిరంజీవి హీరోగా 'ఆచార్య' సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చిరు తనయుడు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కూడా నటిస్తున్నాడు. ఇంతకు ముందు కూడా వీరిద్దరు కలిసి నటించిన...

Ram Charan: 'ఆచార్య'కు బాయ్‌ బాయ్‌... 'ఆర్‌.ఆర్‌.ఆర్‌'కు హాయ్‌... షూటింగ్‌కు ప్యాకప్‌ చెప్పిన మెగా పవర్‌ స్టార్‌..
ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్‌.ఆర్.ఆర్ తో పాటు ఆచార్య మూవీలో తండ్రి చిరంజీవితో కలిసి న‌టిస్తున్నారు.
Narender Vaitla
|

Updated on: Mar 20, 2021 | 1:44 AM

Share

Ram Charan: కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్‌ చిరంజీవి హీరోగా ‘ఆచార్య’ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చిరు తనయుడు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కూడా నటిస్తున్నాడు. ఇంతకు ముందు కూడా వీరిద్దరు కలిసి నటించిన విషయం తెలిసిందే. అయితే ఆ చిత్రాల్లో రామ్‌ చరణ్‌ చిత్రంలో చిరంజీవి గెస్ట్‌ రోల్‌లో నటించాడు. కానీ ఆచార్యలో మాత్రం దానికి భిన్నంగా.. చిరంజీవి హీరోగా నటిస్తోన్న చిత్రంలో రామ్‌ చరణ్‌ అతిధి పాత్రలో నటిస్తున్నాడు. అంతేకాకుండా ఈ సినిమాలో చెర్రీ చాలా సీరియస్‌ రోల్‌లో కనిపించనున్నాడు. దీంతో ఈ సినిమా విడుదల కోసం మెగా అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఆచార్యలో రామ్‌ చరణ్‌పై జరిపిన చిత్రీకరణ ముగిసింది. ఖమ్మంలో జరిగిన చివరి షెడ్యూల్‌ పాల్గొన్న చెర్రీ ఆచార్యకు వీడ్కోలు పలికాడు. ఇక అనంతరం చిన్న బ్రేక్‌ తీసుకున్న రామ్‌ చరణ్‌ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం ఆర్‌.ఆర్‌.ఆర్‌ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. తాజాగా శనివారం నుంచి రామ్‌చరణ్‌కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్‌ సిద్ధమైనట్లు సమాచారం. ఇందులో చెర్రీ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నవిషయం తెలిసిందే. ఇటీవలే చిత్రయూనిట్‌ చెర్రీకి జోడిగా సీత పాత్రలో నటిస్తోన్న అలియా భట్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటిస్తోన్న మరో హీరో ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌ పాత్రలో నటిస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో భారతీయ సినిమా రంగానికి చెందిన ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను అక్టోబర్‌ 13న విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే చిత్ర షూటింగ్‌ను త్వరగతిన పూర్తి చేయడానికి జక్కన్న ప్రణాళికలు రచిస్తున్నాడు.

ఆచార్యలో రామ్‌చరణ్‌ ఫస్ట్‌లుక్‌..

Also Read: Thellavarithe Guruvaram : తెల్లవారితే గురువారం సినిమానుంచి అందమైన మెలోడీ.. సంగీతం అందించిన కాలభైరవ

Ajith Kumar : మరోసారి అభిమానుల మనసు గెలుచుకున్న స్టార్ హీరో.. ఆటోలో ప్రయాణించిన అజిత్

Jathi Ratnalu : జాతిరత్నాలు నుంచి మరో క్రేజీ సాంగ్.. సోషల్ మీడియాలో హల్ చల్