AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: రామ్ చరణ్‌కు మరో అరుదైన గౌరవం.. మేడమ్ టుస్సాడ్స్‌లో గ్లోబల్ స్టార్… తొలి తెలుగు హీరోగా రికార్డు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు అరుదైన గౌరవం దక్కనుంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ రేంజ్‌కు ఎదిగిపోయిన అతనికి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. తన నటనా ప్రతిభకు ప్రతీకగా ఇప్పటికే ఎన్నో పురస్కారాలు, ప్రశంసలు అందుకున్న రామ్ చరణ్ ఇప్పుడు మరో అరుదైన ఘనత అందుకోనున్నాడు.

Ram Charan: రామ్ చరణ్‌కు మరో అరుదైన గౌరవం.. మేడమ్ టుస్సాడ్స్‌లో గ్లోబల్ స్టార్... తొలి తెలుగు హీరోగా రికార్డు
Ram Charan
Basha Shek
|

Updated on: Sep 29, 2024 | 3:50 PM

Share

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు అరుదైన గౌరవం దక్కనుంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ రేంజ్‌కు ఎదిగిపోయిన అతనికి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. తన నటనా ప్రతిభకు ప్రతీకగా ఇప్పటికే ఎన్నో పురస్కారాలు, ప్రశంసలు అందుకున్న రామ్ చరణ్ ఇప్పుడు మరో అరుదైన ఘనత అందుకోనున్నాడు. ప్రతిష్ఠాత్మక మేడమ్ టుస్సాడ్స్‌లో మెగా పవర్ స్టార్ మైనపు విగ్రహాన్ని త్వరలోనే ఆవిష్కరించనున్నారు. చెర్రీతో పాటు అతని పెట్ డాగ్ రైమీ విగ్రహాన్ని కూడా ఈ మ్యూజియంలో ఏర్పాటుచేయనుండడం విగ్రహం. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రక్రియ కూడా పూర్తయ్యిందని తాజాగా జరిగిన ఐఫా వేదక మీద మేడమ్ టుస్సాడ్స్‌ టీమ్‌ అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. ఇందులో టుస్సాడ్స్ మ్యూజియమ్ ప్రతినిధులు రామ్ చరణ్, రైమీల కొలతలు, ఫొటోలు తీసుకోవడం మనం చూడవచ్చు. ఈ సందర్భంగా మాట్లాడిన రామ్ చరణ్ మేడమ్ టుస్సాడ్స్‌ ఫ్యామిలీలో భాగం కావడం తనకు ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపాడు. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులకు ఈ గౌరవం దక్కింది. టాలీవుడ్ నుంచి కూడా పప్రభాస్‌‌, మహేశ్‌ బాబు, అల్లు అర్జున్‌ ల మైనపు విగ్రహాలు మేడమ్ టుస్సాడ్స్ లో కొలువు దీరాయి. అయితే రామ్ చరణ్ మైనపు విగ్రహం విషయంలో మాత్రం చాలా ప్రత్యేకత ఉంది. అదేంటంటే..

ఇవి కూడా చదవండి

మేడమ్ టుస్సాడ్స్ పుట్టినిల్లుగా లండన్ మ్యూజియానికి చరిత్ర ఉంది. ఇప్పుడు అక్కడ అడుగు పెడుతున్న మొదటి తెలుగు హీరోగా రామ్ చరణ్ అరుదైన గౌరవాన్ని అందుకోనున్నారు. ప్రభాస్‌ (బ్యాంకాక్‌ మ్యూజియం), మహేశ్‌ బాబు (సింగపూర్‌), అల్లు అర్జున్‌ (దుబాయ్‌)లలో మైనపు విగ్రహాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీని గురించి తెలుసుకున్న మెగాభిమానులు ఎగిరి గంతేస్తున్నారు.

అనౌన్స్ మెంట్ వీడియో ఇదిగో..

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో గేమ్ ఛేంజర్ అనే సినిమాలో నటిస్తున్నాడు రామ్ చరణ్. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. క్రిస్మస్‌ సందర్భంగా ‘గేమ్ ఛేంజ‌ర్‌’ సినిమాను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు.

 గేమ్ ఛేంజర్  రా మచ్చా మచ్చా’ సాంగ్ ప్రోమో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఖడ్గం సినిమాలో ఆ సీన్ ఎందుకు పెట్టామంటే..
ఖడ్గం సినిమాలో ఆ సీన్ ఎందుకు పెట్టామంటే..
మారిన టోల్ ఛార్జీ రూల్స్.. కట్టకపోతే ఆ సేవలు బంద్
మారిన టోల్ ఛార్జీ రూల్స్.. కట్టకపోతే ఆ సేవలు బంద్
కేతు సంచారంతో ఈ రాశుల వారికి ఇక స్వర్ణయుగమే..! మీ రాశి ఉందా..?
కేతు సంచారంతో ఈ రాశుల వారికి ఇక స్వర్ణయుగమే..! మీ రాశి ఉందా..?
హైదరాబాద్‌లో ఆ సంస్థ విస్తరణకు కుదిరిన MOU.. భారీగా ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ఆ సంస్థ విస్తరణకు కుదిరిన MOU.. భారీగా ఉద్యోగాలు
ప్లాస్టిక్ వస్తువులపై మరకలు పోవట్లేదా? ఇది బెస్ట్ సొల్యూషన్!
ప్లాస్టిక్ వస్తువులపై మరకలు పోవట్లేదా? ఇది బెస్ట్ సొల్యూషన్!
దేశం కంటే లీగ్ క్రికెట్టే ముఖ్యమంటూ స్టేట్ మెంట్.. కట్‌చేస్తే..
దేశం కంటే లీగ్ క్రికెట్టే ముఖ్యమంటూ స్టేట్ మెంట్.. కట్‌చేస్తే..
ఐన్‌స్టీన్ వీసా అంటే ఏమిటి.. దీనిని ఎవరికి ఇస్తారు.. ఎలా పొందాలి!
ఐన్‌స్టీన్ వీసా అంటే ఏమిటి.. దీనిని ఎవరికి ఇస్తారు.. ఎలా పొందాలి!
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు
నల్లగా బొగ్గులా మారిన వెండి మళ్ళీ ప్రకాశిస్తుంది..
నల్లగా బొగ్గులా మారిన వెండి మళ్ళీ ప్రకాశిస్తుంది..
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి..
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి..