Ram Charan: సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌.. టాలీవుడ్‌ ఇండస్ట్రీలోనే మొదటిసారిగా..

ఈ మధ్యకాలంలో నెట్టింట్లోనూ బాగా యాక్టివ్‌గా ఉంటున్నాడు చెర్రీ. తన సతీమణి ఉపాసనతో కలిసి దిగిన ఫొటోలతో పాటు ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌, వెకేషన్‌ పిక్స్‌, మూవీ అప్‌డేట్స్‌ను ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంటున్నాడు. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లో అతనిని అనుసరించే వారి సంఖ్య అమాంతం పెరిగిపోతోంది.

Ram Charan: సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌.. టాలీవుడ్‌ ఇండస్ట్రీలోనే మొదటిసారిగా..
Ram Charan
Follow us
Basha Shek

|

Updated on: Feb 09, 2023 | 8:43 AM

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయాడు మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌. ఆ సినిమాలో అతను పోషించిన సీతారామరాజు పాత్రకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. సినిమా కూడా వరల్డ్‌వైడ్‌గా బ్లాక్‌బాస్టర్‌ టాక్‌ సొంతం చేసుకోవడంతో చెర్రీ రేంజ్‌ అమాంతం పెరిగిపోయింది. సోషల్‌ మీడియాలోనూ అతనికి ఫాలోవర్స్‌ విపరీతంగా పెరిగిపోతున్నారు. ఈ మధ్యకాలంలో నెట్టింట్లోనూ బాగా యాక్టివ్‌గా ఉంటున్నాడు చెర్రీ. తన సతీమణి ఉపాసనతో కలిసి దిగిన ఫొటోలతో పాటు ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌, వెకేషన్‌ పిక్స్‌, మూవీ అప్‌డేట్స్‌ను ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంటున్నాడు. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లో అతనిని అనుసరించే వారి సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే చెర్రీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా 12 మిలియన్లకు చేరుకుంది. తద్వారా టాలీవుడ్‌ నుంచి అతి తక్కువ సమయంలో 12 మిలియన్ ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్న హీరోగా రామ్ చరణ్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

కాగా స్టార్ హీరోలకు 12 మిలియన్ల ఫాలోవర్లు అంటే సాధారణ విషయం కాదు. ప్రస్తుతం సౌత్‌ ఇండస్ట్రీలో ఈ నంబర్ దాటిన హీరోలు ఇద్దరే మాత్రమే ఉన్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 19.9 మిలియన్ల ఫాలోవర్లతో మొదటి స్థానంలో ఉన్నాడు. 17.8 మిలియన్స్ ఫాలోవర్స్‌తో రౌడీ హీరో విజయ్ దేవరకొండ రెండో ప్లేసులో ఉన్నాడు. ఇప్పుడు 12 మిలియన్స్ ఫాలోవర్స్ తో రామ్ చరణ్ మూడో స్థానంలోకి చేరారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం సౌత్‌ ఇండియన్‌ స్టార్ డైరెక్టర్ శంకర్ తో ఓ సినిమా చేస్తున్నాడు చెర్రీ. #RC15 పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో మరో ప్రాజెక్టుకు ఒకే చెప్పాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

భారతీయులకు భారీ గుడ్‌న్యూస్.. అమెరికా సంచలన నిర్ణయం!
భారతీయులకు భారీ గుడ్‌న్యూస్.. అమెరికా సంచలన నిర్ణయం!
వందకోట్లు ఇచ్చిన ఆ పని చేయను..
వందకోట్లు ఇచ్చిన ఆ పని చేయను..
మొబైల్‌ని ఫుల్ చార్జింగ్ చేయడానికి ఎన్ని యూనిట్ల విద్యుత్ అవసరం
మొబైల్‌ని ఫుల్ చార్జింగ్ చేయడానికి ఎన్ని యూనిట్ల విద్యుత్ అవసరం
కుంభమేళాపై విదేశీయులూ ఆసక్తి ఎన్ని దేశాల వారు ఆరా తీస్తున్నారంటే
కుంభమేళాపై విదేశీయులూ ఆసక్తి ఎన్ని దేశాల వారు ఆరా తీస్తున్నారంటే
సూపర్ ఫీచర్స్‌తో నయా ఫోన్ రిలీజ్ చేసిన రెడ్‌మీ..!
సూపర్ ఫీచర్స్‌తో నయా ఫోన్ రిలీజ్ చేసిన రెడ్‌మీ..!
మేం తలుచుకుంటే కాంగ్రెస్ నేతలు రోడ్ల మీద తిరగలేరు: కిషన్ రెడ్డి
మేం తలుచుకుంటే కాంగ్రెస్ నేతలు రోడ్ల మీద తిరగలేరు: కిషన్ రెడ్డి
థాయిలాండ్ కు పర్యాటకుల క్యూ.. 2024లో ఎంతమంది సందర్శించారంటే..?
థాయిలాండ్ కు పర్యాటకుల క్యూ.. 2024లో ఎంతమంది సందర్శించారంటే..?
హైవేపై పోలీసులను చూసి పరుగులు పెట్టిన కారు.. ఛేజ్ చేసి పట్టుకోగా.
హైవేపై పోలీసులను చూసి పరుగులు పెట్టిన కారు.. ఛేజ్ చేసి పట్టుకోగా.
వెలుగులోకి నయా స్కామ్.. ఆర్డర్ చేయకుండా ఇంటికి వస్తువు వచ్చిందా.?
వెలుగులోకి నయా స్కామ్.. ఆర్డర్ చేయకుండా ఇంటికి వస్తువు వచ్చిందా.?
గడ్డకట్టిన జలపాతం కింద ఆడుకుంటున్న ప్రజలు.. ఇంతలో ఏం జరిగిందంటే
గడ్డకట్టిన జలపాతం కింద ఆడుకుంటున్న ప్రజలు.. ఇంతలో ఏం జరిగిందంటే