బ్రిటిష్ పాలనలో భారతదేశపు తొలి బడ్జెట్ను 1860 ఏప్రిల్ 7న స్కాటిష్ ఆర్థికవేత్త, లిబరల్ నేత జేమ్స్ విల్సన్ సమర్పించారు. ది ఎకనమిస్ట్ వారపత్రిక, చార్టర్డ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపకుడిగా, వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆర్థిక కమిటీ సభ్యుడిగా ఆయన విశేష సేవలు అందించారు.