Indian Budget History: బ్రిటిష్ పాలనలో జేమ్స్ విల్సన్ తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టగా, స్వాతంత్ర్యం అనంతర తొలి బడ్జెట్ను ఆర్.కె. షణ్ముగం శెట్టి 1947 నవంబర్ 26న సమర్పించారు. గణతంత్ర భారత్లో తొలి బడ్జెట్ను 1950 ఫిబ్రవరి 28న జాన్ మథాయ్ ప్రవేశపెట్టారు. దీని రూపకల్పనలో ప్రొ. ప్రశాంత చంద్ర మహలనోబిస్ కీలక పాత్ర పోషించారు.