Rakul Preet Singh: రామాయణంలో రకుల్.. కెరీర్‏లో తొలిసారి అలాంటి పాత్రలో కనిపించనున్న హీరోయిన్..

అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియాలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్, రవితేజ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఇక ఈ బ్యూటీకి అటు హిందీలోనూ ఆఫర్స్ వచ్చాయి. అక్కడ కూడా వరుస సినిమాలతో అలరించింది. కానీ హిందీలో ఆమెకు అనుకున్నంత క్రేజ్ మాత్రం రాలేదు. ఒకట్రెండు సినిమాలతో సరిపెట్టుకుంది రకుల్. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఒక్క సినిమా లేదు.

Rakul Preet Singh: రామాయణంలో రకుల్.. కెరీర్‏లో తొలిసారి అలాంటి పాత్రలో కనిపించనున్న హీరోయిన్..
Rakul Preet Singh
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 11, 2024 | 10:27 AM

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు వరుస సినిమాలో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది రకుల్ ప్రీత్ సింగ్. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా ఈ బ్యూటీకి అవకాశాలు క్యూ కట్టేవి. అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియాలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్, రవితేజ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఇక ఈ బ్యూటీకి అటు హిందీలోనూ ఆఫర్స్ వచ్చాయి. అక్కడ కూడా వరుస సినిమాలతో అలరించింది. కానీ హిందీలో ఆమెకు అనుకున్నంత క్రేజ్ మాత్రం రాలేదు. ఒకట్రెండు సినిమాలతో సరిపెట్టుకుంది రకుల్. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఒక్క సినిమా లేదు. కేవలం మూవీ ఈవెంట్స్, పార్టీస్ అంటూ కాలం గడిపేస్తుంది. అలాగే ఓటీటీలో వెబ్ సిరీస్ చేస్తుంది. కానీ అనుకున్న రేంజ్ లో మాత్రం క్రేజ్ రావడం లేదు. ఇక సినిమా అప్డేట్స్ మాత్రం ఇవ్వలేకపోతుంది. అటు త్వరలోనే తన ప్రియుడు జాకీ భగ్నానీతో పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అయ్యింది. దీంతో ఈ బ్యూటీ సినీ ప్రయాణానికి ఇక ఫుల్ స్టాప్ పెట్టేసిందని ప్రచారం నడిచింది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరలవుతుంది.

కొన్నాళ్లుగా ఎలాంటి ఆఫర్స్ లేకుండా సైలెంట్ గా ఉన్న రకుల్ కు.. ఇప్పుడు భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులో ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ డైరెక్టర్ నితేశ్ తివారి అత్యంత ప్రతిష్టాత్మకంగా రామాయణాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ ప్రొడ్యూసర్స్, నిర్మాత అల్లు అరవింద్ అంతా కలిసి ఈమూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే కాస్టింగ్ పనులు ప్రారంభమయ్యాయి. అలాగే ప్రీ ప్రొడక్షన్, స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో బీటౌన్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా.. న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి సీతగా కనిపించనుందని ప్రచారం నడుస్తుంది.

అలాగే ఈ సినిమాలో రావణుడి పాత్రలో యష్ నటించనున్నారని.. హనుమంతుడిగా సన్నీ డియోల్ కనిపించనున్నారని టాక్ నడుస్తుంది. అయితే ఈ మూవీలో కీలకమై శూర్పణఖ పాత్రను రకుల్ పోషించినట్లు సమాచారం. ఈ పాత్ర కోసం మేకర్స్ ఆమెను సంప్రదించగా.. వెంటనే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని… త్వరలోనే లుక్ టెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీలో విభీషణుడికా విజయ్ సేతుపతి నటించనున్నారట.