AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mamta Mohandas: లగ్జరీ కారు కొన్న మమతా మోహన్ దాస్.. ధర తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..

మమతా.. ఒకప్పుడు తెలుగులో అత్యంత డిమాండ్ ఉన్న నటీమణులలో ఒకరు. కానీ సినిమాల ఎంపిక సరిగ్గా లేకపోవడంతో అగ్రస్థానంలో ఉన్న నటి మెల్లగా బ్యాక్‌గ్రౌండ్‌కి వెళ్లిపోయింది. కానీ సినిమాల్లో నటించడం మాత్రం ఆపలేదు. చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న మమతా.. ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇటీవలే రుద్రంగి సినిమాతో టాలీవుడ్ అడియన్స్ ముందుకు వచ్చింది. జగపతి బాబు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మిశ్రమ స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే..

Mamta Mohandas: లగ్జరీ కారు కొన్న మమతా మోహన్ దాస్.. ధర తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..
Mamta Mohandas
Rajitha Chanti
|

Updated on: Feb 11, 2024 | 11:12 AM

Share

తెలుగులో చేసింది అతి తక్కువ సినిమాలే అయిన తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది మమతా మోహన్ దాస్. యమదొంగ, కృష్ణార్జున, హోమం చిత్రాల్లో నటించి మెప్పించింది. నటనపరంగా ప్రశంసలు అందుకున్నప్పటికీ తెలుగులో అవకాశాలు మాత్రం రాలేదు. మలయాళం, తెలుగు, తమిళ సినిమాల్లో కూడా పలు సినిమాల్లో నటించారు. మమతా.. ఒకప్పుడు తెలుగులో అత్యంత డిమాండ్ ఉన్న నటీమణులలో ఒకరు. కానీ సినిమాల ఎంపిక సరిగ్గా లేకపోవడంతో అగ్రస్థానంలో ఉన్న నటి మెల్లగా బ్యాక్‌గ్రౌండ్‌కి వెళ్లిపోయింది. కానీ సినిమాల్లో నటించడం మాత్రం ఆపలేదు. చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న మమతా.. ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇటీవలే రుద్రంగి సినిమాతో టాలీవుడ్ అడియన్స్ ముందుకు వచ్చింది. జగపతి బాబు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మిశ్రమ స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా మమతా కొత్త ఐషారామి స్పోర్ట్స్‌ని కొనుగోలు చేసింది. ఈ భామ కొత్త BMW Z4, M40i కారును కొనుగోలు చేశారు.

ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ఈ కారు ధర కొచ్చిలో రూ.1.20 కోట్లు ఉంటుంది.. ఇది ప్యూర్ స్పోర్ట్స్ కారు. ఈ కారులో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి, 3000 cc పవర్ ఉన్న ఈ కారు కొన్ని సెకన్లలో 0 నుండి 100 కి.మీ వరకు వేగవంతం చేయగలదు. అత్యాధునిక సాంకేతికత కూడా ఉన్న ఈ కారులో ఇద్దరు మాత్రమే కూర్చోవాలి. ఇది ఓపెన్ టైప్ కారు, పైకప్పును మూసివేయడం, తెరవడం వంటి సాంకేతికతను కూడా కలిగి ఉంది.

మమతా మోహన్‌దాస్ 2005లో మలయాళ సినిమాలో నటించడం ప్రారంభించారు. పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత 2008లో కిచ్చా సుదీప్ నటించిన ‘గూలీ’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అంతకు ముందు ఎన్టీఆర్ తో కలిసి నటించిన ‘యమదొంగ’ సినిమాతో మమతా మోహన్ దాస్ కు పెద్ద పేరు వచ్చింది. అనుష్క శెట్టి కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటైన ‘అరుంధతి’ సినిమాలో మమతా మోహన్‌దాస్‌కి మొదట ఆఫర్ వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు మమత ఆ అవకాశాన్ని తిరస్కరించింది. అది అనుష్క శెట్టికి వెళ్లి పెద్ద హిట్ అయింది. మలయాళం నుండి వచ్చిన మమత కూడా కొంతమంది స్థానిక తమిళ , తెలుగు నటీమణుల నుండి వ్యతిరేకతను ఎదుర్కోవలసి వచ్చిందని పేర్కొంది. నయనతార వ్యతిరేకతతో మమత నటించిన ఓ సినిమాలోని పాటను తొలగించారు. అలాగే కొన్నాళ్ల పాటు ఆమె క్యాన్సర్ వ్యాధితో పోరాడి గెలిచింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.