Samyuktha Menon: గుర్రపు స్వారీ చేస్తోన్న గోల్డెన్ బ్యూటీ.. పెళ్లికి ముందు ఇదేంటీ అంటోన్న నెటిజన్స్.. ఎవరో తెలుసా ?..

2024 నా గురించి.. నా జీవితం గురించి చాలా విషయాలు నేర్పించింది. నా జీవితంలో సాహసాలు చేయడమంటే నాకు చాలా ఇష్టం. నాకంటూ సౌకర్యవంతమైన వాతావరణాన్ని ఏర్పరచుకుని అందులోనే ఉండాలనుకోను.. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. నటిగా నేను కొత్త విషయాలను నేర్చుకోవాలనుకుంటున్నాను అలాగే వాటిని అమలు చేయాలనుకుంటున్నాను. రోజువారీ జీవితంలో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. నేను ప్రస్తుతం నా తదుపరి చిత్రం స్వయంబు కోసం గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నాను..

Samyuktha Menon: గుర్రపు స్వారీ చేస్తోన్న గోల్డెన్ బ్యూటీ.. పెళ్లికి ముందు ఇదేంటీ అంటోన్న నెటిజన్స్.. ఎవరో తెలుసా ?..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 11, 2024 | 9:31 AM

టాలీవుడ్ ఇండస్ట్రీలో గోల్డెన్ బ్యూటీ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు సంయుక్త మీనన్. భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తుంది. సంయుక్త ఇప్పటివరకు నటించిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావడంతో ఈ బ్యూటీకి అవకాశాలు క్యూ కట్టాయి. ఆ తర్వాత బింబిసార, సార్, విరూపాక్ష చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగు, తమిళం, మలయాళ భాషలలో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. ఇటీవలే డెవిల్ మూవీతో అలరించింది సంయుక్త. కళ్యాణ్ రామ్ నటించిన ఈ మూవీ అంతగా మెప్పించలేకపోయింది. ప్రస్తుతం సంయుక్త చేతిలో ఒకటి రెండు సినిమాలు మాత్రమే ఉన్నాయి. ఇదిలా అంటే.. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటో నెట్టింట వైరలవుతుంది. అందులో ఆమె గుర్రపు స్వారీ చేస్తూ కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

గుర్రపు స్వారీ చేస్తున్న ఫోటోస్ షేర్ చేస్తూ పెద్ద నోట్ రాసుకొచ్చింది సంయుక్త. “2024 నా గురించి.. నా జీవితం గురించి చాలా విషయాలు నేర్పించింది. నా జీవితంలో సాహసాలు చేయడమంటే నాకు చాలా ఇష్టం. నాకంటూ సౌకర్యవంతమైన వాతావరణాన్ని ఏర్పరచుకుని అందులోనే ఉండాలనుకోను.. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. నటిగా నేను కొత్త విషయాలను నేర్చుకోవాలనుకుంటున్నాను అలాగే వాటిని అమలు చేయాలనుకుంటున్నాను. రోజువారీ జీవితంలో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. నేను ప్రస్తుతం నా తదుపరి చిత్రం స్వయంబు కోసం గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నాను.. నన్ను నమ్మండి ఈ ప్రయాణం ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది. గుర్రంపై ప్రయాణం చేయడం నాకు చాలా ఇష్టం. మనశ్సాంతిగా ఉంటుంది. గుర్రపు స్వారీ ప్రతి అడ్డంకిని తొలగిస్తున్నట్లు అనిపిస్తుంది” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.

అయితే కొన్ని రోజుల క్రితం సంయుక్త పెళ్లి గురించి పలు రూమర్స్ ఫిల్మ్ సర్కిల్లో వైరలయ్యాయి. త్వరలోనే ఆమె వివాహం జరగనుందని.. అందుకే ఈ బ్యూటీ మరో ప్రాజెక్ట్ ఒప్పుకోవడం లేదంటూ ప్రచారం నడిచింది. అయితే తన పెళ్లి పై వస్తున్న వార్తలపై స్పందించలేదు. కానీ ఇప్పటికీ కోలీవుడ్ ఇండస్ట్రీలో సంయుక్త పెళ్లి పనులు ప్రారంభమయ్యాయని టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలో తన ప్రస్తుత సినిమా కోసం గుర్రపు స్వారీ చేస్తున్నట్లు సంయుక్త పోస్ట్ చేసింది. దీంతో పెళ్లికి ముందు ఇలాంటి పనులు ఎందుకు ?.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

View this post on Instagram

A post shared by Samyuktha (@iamsamyuktha_)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.