AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rakshit Shetty: ‘మీతో రష్మిక ఇంకా టచ్‏లో ఉందా ?’.. రక్షిత్ శెట్టి రియాక్షన్ ఏంటంటే..

రక్షిత్ ఈ చిత్రాన్ని తెలుగులో ‘సప్త సాగరాలు దాటి’ పేరుతో విడుదల చేయబోతున్నారని ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో కొద్ది రోజులుగా రక్షిత్ శెట్టి అండ్ టీమ్ తెలుగు రాష్ట్రాల్లో జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రష్మికకు సంబంధించిన ప్రశ్నలు రక్షిత్ కు ఎదురవుతున్నాయి. వన్-ఆన్-వన్ ఇంటర్వ్యూలో రష్మిక గురించిన ప్రశ్నకు యూట్యూబర్ ఎప్పటిలాగే ప్రశాంతంగా, గౌరవంగా సమాధానం ఇచ్చారు.

Rakshit Shetty: 'మీతో రష్మిక ఇంకా టచ్‏లో ఉందా ?'.. రక్షిత్ శెట్టి రియాక్షన్ ఏంటంటే..
Rashmika Mandanna, Rakshith
Rajitha Chanti
|

Updated on: Sep 21, 2023 | 10:56 PM

Share

‘ 777 చార్లీ ‘ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఫుల్ క్రేజ్ అందుకున్నాడు కన్నడ హీరో రక్షిత్ శెట్టి. ఈ సినిమాతో ఆయనకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక ఇటీవల నటించిన ‘సప్త సాగరదాచే ఎల్లో’ సినిమా కూడా హిట్ అయ్యింది. మాస్, కమర్షియల్ ఫార్ములాను పక్కన పెట్టి కంటెంట్‌పై దృష్టి సారించిన రక్షిత్ శెట్టి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటున్నాడు. అంతేకాకుండా తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ విషయంలోనూ మరింత శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన నటించిన సప్త సాగరదాచే ఎల్లో’ చిత్రాన్ని తెలుగులోకి తీసుకువస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో ‘సప్త సాగరదాచే ఎల్లో’ చిత్రాన్ని విడుదల చేస్తూ ఆ సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్నాడు.

రక్షిత్ ఈ చిత్రాన్ని తెలుగులో ‘సప్త సాగరాలు దాటి’ పేరుతో విడుదల చేయబోతున్నారని ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో కొద్ది రోజులుగా రక్షిత్ శెట్టి అండ్ టీమ్ తెలుగు రాష్ట్రాల్లో జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రష్మికకు సంబంధించిన ప్రశ్నలు రక్షిత్ కు ఎదురవుతున్నాయి. వన్-ఆన్-వన్ ఇంటర్వ్యూలో రష్మిక గురించిన ప్రశ్నకు యూట్యూబర్ ఎప్పటిలాగే ప్రశాంతంగా, గౌరవంగా సమాధానం ఇచ్చారు.

‘రష్మికతో రక్షిత్ శెట్టి ఇంకా టచ్‌లో ఉన్నాడా?’ ఒక యూట్యూబర్ ప్రశ్న అడిగాడు. రక్షిత్ శెట్టి సమాధానమిస్తూ, “అవును, మేము టచ్‌లో ఉన్నాము. ఆమె ఎప్పుడూ పెద్ద కలలు కనేది, ఇప్పుడు ఆమె ఆ కలలను నిజం చేస్తోంది. ఆమె విజయాలను ప్రశంసించాల్సిందే” అంటూ చెప్పుకొచ్చాడు. గతంలో రష్మిక గురించి రక్షిత్ శెట్టిని ప్రశ్నించినప్పుడల్లా ఇలాంటి సమాధానాలు ఇచ్చాడు.

అదే ఇంటర్వ్యూలో, రక్షిత్ శెట్టి కన్నడ చిత్ర పరిశ్రమ, కన్నడ చిత్ర పరిశ్రమలోని స్టార్ నటులు, రిషబ్ శెట్టి, పరమవ స్టూడియోస్ అండ్ పిక్చర్స్, తన చిత్రం ‘సప్త సాగరదాచే ఎల్లో’ మరియు మరెన్నో గురించి మాట్లాడారు. ఇంటర్వ్యూ మధ్యలో రిషబ్ శెట్టికి ఫోన్ చేసి మాట్లాడాడు. వీరిద్దరి స్నేహం, వారి తదుపరి ప్రాజెక్ట్ , మరెన్నో గురించి నటుడు రక్షిత్ శెట్టి మాట్లాడారు.

‘సప్త సాగరదాచే ఎల్లో’ చిత్రానికి హేమంత్ రావు దర్శకత్వం వహించగా, రక్షిత్ శెట్టి స్వయంగా నిర్మించారు. అందమైన ప్రేమకథతో తెరకెక్కిన ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్. రుక్మిణి నటనకు ప్రశంసలు అందాయి. ఇప్ప‌టికే మొద‌టి పార్ట్‌ను విడుద‌ల చేయ‌గా, రెండో భాగం అక్టోబ‌ర్ నెల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.