Maa Elections 2021: ఎన్టీఆర్‌ని రిక్వెస్ట్ చేసిన రాజీవ్ కనకాల..! ఏ విషయంలో తెలుసా..?
Maa Elections 2021: 'మా' ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. అభ్యర్థులు పోటా పోటీగా వ్యవహరిస్తున్నారు. పరస్పరం వ్యక్తిగత దూషణలకు
Maa Elections 2021: ‘మా’ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. అభ్యర్థులు పోటా పోటీగా వ్యవహరిస్తున్నారు. పరస్పరం వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు. దీంతో ఈ వ్యవహారం ఇండస్ట్రీలోని కొంతమంది పెద్దలకు నచ్చడం లేదు. ‘మా’ ఎలక్షన్స్ కోసం ఇంత రాద్దాంతం ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు కొంతమంది ఈ ఎన్నికల్లో ఓటు వేయడానికి నిరాకరిస్తున్నారు. ఇటీవల టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ మా ఎన్నికల్లో వేటు వేయడంలేదని ప్రకటించారు.
అయితే ఈ విషయంపై తాజాగా నటుడు రాజీవ్ కనకాల స్పందించారు. ఈ ఏడాది జరిగే ‘మా’ ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్టీఆర్‌ని కోరారు. అంతేకాదు ప్రతి ఒక్క ‘మా’ సభ్యుడు ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఇటీవల ఓ మీడియా సమావేశంలో రాజీవ్ కనకాల మాట్లాడుతూ..’మా’ ఎన్నికల్లో ఎన్టీఆర్ వేటు వేయాడానికి రానన్నాడని జీవిత చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ‘ఎన్టీఆర్‌తో ఆమె మాట్లాడారో లేదో నాకు తెలియదు కానీ ‘మా’ సభ్యులందరు ఓటు హక్కు వినియోగించుకోవాలి. అలాగే ఎన్టీఆర్‌తో కూడా ఓటు వేయాలని మాట్లాడుతానని’ తెలిపారు.
ప్రస్తుతం ‘మా’ పోటీలో ప్రకాశ్‌రాజ్ ప్యానెల్, మంచు విష్ణు ప్యానెల్ ఉన్న సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు నరేశ్ మంచు విష్ణు ప్యానెల్‌కి మద్దుతు తెలుపుతున్నారు. మెగా బ్రదర్ నాగబాబు, ఇతరత్రా ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌కి మద్దతు ఇస్తున్నారు. ‘మా’ ఎన్నికలు ఈ రోజు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతాయి. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో ఎన్నికలను నిర్వహిస్తున్నారు. రాత్రి వరకు ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.