RajiniKanth Birthday: సౌత్ ఇండస్ట్రీలో అత్యంత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న హీరో.. రజినీకాంత్ ఆస్తి వివరాలు తెలుసా ?..

కండెక్టర్ స్థాయి నుంచి ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే సూపర్ స్టార్‏గా నిలిచిన రజినీకాంత్ సినీ ప్రస్థానం గురించి తెలిసిందే. తమిళం, తెలుగు, కన్నడ, బెంగాళీ చిత్రాల్లో నటించి అలరించారు. 73 ఏళ్ల వయసులోనూ అభిమానులకు వినోదాన్ని అందించేందుకు కష్టపడుతున్నారు రజినీ. ఇప్పటివరకు దాదాపు 169 సినిమాలు పూర్తి చేసి.. ప్రస్తుతం 170వ సినిమా చేస్తున్నారు. అంతేకాదు.. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరో రజినీ కావడం విశేషం.

RajiniKanth Birthday: సౌత్ ఇండస్ట్రీలో అత్యంత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న హీరో.. రజినీకాంత్ ఆస్తి వివరాలు తెలుసా ?..
Rajinikanth
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 12, 2023 | 12:03 PM

సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. అంతేకాకుండా రజినీకి సంబంధించిన రేర్ ఫోటోస్.. పర్సనల్ విషయాలు.. ఫ్యామిలీ ఫోటోస్ ఇప్పుడు నెట్టింట షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్. కండెక్టర్ స్థాయి నుంచి ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే సూపర్ స్టార్‏గా నిలిచిన రజినీకాంత్ సినీ ప్రస్థానం గురించి తెలిసిందే. తమిళం, తెలుగు, కన్నడ, బెంగాళీ చిత్రాల్లో నటించి అలరించారు. 73 ఏళ్ల వయసులోనూ అభిమానులకు వినోదాన్ని అందించేందుకు కష్టపడుతున్నారు రజినీ. ఇప్పటివరకు దాదాపు 169 సినిమాలు పూర్తి చేసి.. ప్రస్తుతం 170వ సినిమా చేస్తున్నారు. అంతేకాదు.. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరో రజినీ కావడం విశేషం.

సూపర్ స్టార్ రజనీకాంత్ స్వస్థలం కర్ణాటక. సినిమాల్లోకి రాకముందు కండక్టర్ గా పనిచేశారు. నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రజినీ.. 1975లో వచ్చిన అపూర్వ రాగంగళ్ సినిమాతో హీరోగా పరిచమయ్యారు. ఆ తర్వాత కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం వంటి పలు చిత్రాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. కెరీర్ మొదట్లో ఎంతో తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఇటీవల విడుదలైన జైలర్ చిత్రానికి దాదాపు రూ.100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఇక ఇప్పుడు ఆయన నటిస్తున్న 170వ సినిమాకు రూ.140 కోట్లు.. 171 సినిమాకు రూ.200 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

సూపర్ స్టార్ నికర విలువ రూ.500 కోట్లు అని తెలుస్తోంది. కోట్ల సంపద, పేరు, ఆస్తులు ఉన్నప్పటికీ రజినీ మాత్రం సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. ప్రస్తుతం తలైవా.. చెన్నైలో బోయిస్ గార్డెన్స్‌లోని తన భవనంలో నివసిస్తున్నారు. ఈ బంగ్లా విలువ దాదాపు రూ.40 కోట్లు ఉంటుందని సమాచారం. అంతేకాకుండా చెన్నైలో వివిధ ప్రాంతాల్లో ఇళ్లు ఉన్నాయి. చెన్నైలో రాఘవేంద్ర కల్యాణ మండపం ఉంది. ఆయన సొంత రాష్ట్రం కర్ణాటకలో కూడా ఇళ్లు, ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ దగ్గర కేవలం 4 ఖరీదైన కార్లు మాత్రమే ఉన్నాయి. ఈ నాలుగు కార్ల విలువ రూ.20 కోట్లు ఉంటుందని టాక్.

రజనీకాంత్‌కు ఆధ్యాత్మికత అంటే చాలా ఆసక్తి. యోగా, ధ్యానం చేస్తుంటారు. అలాగే తన ప్రతి సినిమా విడుదలకు ముందు గుడికి వెళ్లి పూజలు చేస్తుంటారు. అప్పుడప్పుడు హిమాలయాలను సందర్శిస్తాడు. రామకృష్ణ పరమహంస, స్వామి సచ్చిదానంద, రాఘవేంద్ర, స్వామి మహావతార్ బాబాజీ, రమణ మహర్షి వంటి ఆధ్యాత్మిక గురువులను విశ్వసిస్తారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.