AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajinikanth Annathe: శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సూపర్ స్టార్ సినిమా..

కరోనా విజృంభిస్తున్నా.. తలైవర్‌ రజినీకాంత్‌ విజయవంతంగా 32 రోజుల షెడ్యూల్‌ను పూర్తి చేశారు. కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ.. సెట్ లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ.. ఈ షెడ్యూల్‌ను అనుకున్న సమయానికే పూర్తి చేశారు

Rajinikanth Annathe: శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సూపర్ స్టార్ సినిమా..
Rajeev Rayala
|

Updated on: May 11, 2021 | 8:57 PM

Share

కరోనా విజృంభిస్తున్నా.. తలైవర్‌ రజినీకాంత్‌ విజయవంతంగా 32 రోజుల షెడ్యూల్‌ను పూర్తి చేశారు. కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ.. సెట్ లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ.. ఈ షెడ్యూల్‌ను అనుకున్న సమయానికే పూర్తి చేశారు రజినీ.రజినీకాంత్ హీరోగా నయన తార, కీర్తి సురేష్‌లు హీరోయిన్‌లుగా.. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “అన్నాత్తే”. కోవిడ్ కారణంగా.. రజినీకాంత్ ఆరోగ్య పరిస్థితుల కారణంగా ఇప్పటి వరకు ఈ చిత్రం వాయిదా పడుతూ వచ్చింది. అయితే సినిమా చిత్రీకరణ ఆలస్యం అవుతుండడంతో ఈ సినిమా షూటింగ్‌ను ఎలాగైనా ముగించాలని అనుకున్న చిత్రబృందం.. రామోజిఫిల్మ్ సిటీలో అన్ని కోవిడ్ జాగ్రత్తలను పాటిస్తూ.. 32 రోజుల షెడ్యూల్ ను పూర్తి చేసింది. ఈ షెడ్యూల్‌లో రజినీకాంత్‌తో పాటు నయనతార, కీర్తిసురేష్, జగపతిబాబు, అభిమన్యు సింగ్ తదితరులు నటించారు.

ఈ షెడ్యూల్‌తో రజినీకాంత్ కు సబంధించిన సన్నివేశాలన్నీ పూర్తయ్యాయని… ఇక కలకత్తా నేపథ్యంలో కీర్తిసురేష్‌ సన్నివేశాలు మాత్రమే ఉన్నాయని చిత్రబృందం తెలిపింది.ఈ సినిమా సన్‌ పిక్చర్స్‌ బ్యానర్లో తెరకెక్కుతోంది. డి. ఇమాన్‌ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఈ సినిమాను అక్టోబర్ లో విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్ చేస్తున్నారు.ఇటీవల ఆరోగ్యం దెబ్బతినడంతో రజినీకాంత్ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. కొంత కాలం గ్యాప్ తీసుకున్న ఆయన ఇప్పుడు తిరిగి షూటింగ్ లో పాల్గొంటున్నారు. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎదో ఒక రకంగా సినిమాకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇంతలో సూపర్ స్టార్ రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. దాంతో సినిమా షూటింగ్ కు  బ్రేక్ ఇచ్చి పొలిటికల్ ఎంట్రీ కోసం రంగం సిద్ధం చేసుకున్నారు. అంతా పూర్తయి మరి కొద్దిరోజుల్లో పార్టీ పేరు అనౌన్స్ చేద్దాం అనుకున్నారు. చకచకా ‘అన్నాతే’ షూటింగ్ ను కంప్లీట్ చేసి పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెడదాం అనుకునే టైంలో రజినీ ఆరోగ్యం దబ్బతిన్నది. దాంతోఆయన ఆసుపత్రిపాలయ్యారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Chiranjeevi : TNR కుటుంబానికి ఆర్ధిక సాయం చేసిన మెగాస్టార్.. కనీటిపర్యంతం అయిన TNR సతీమణి..

Thalapathy Vijay: దళపతి విజయ్ తో దిల్ రాజు సినిమా..మాస్టర్ రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవుతారు..