AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi : TNR కుటుంబానికి ఆర్ధిక సాయం చేసిన మెగాస్టార్.. కనీటిపర్యంతం అయిన TNR సతీమణి..

కరోనా మహమ్మారి ఎంతోమందిని బలితీసుకుంటుంది. ఇప్పటికే చాలామంది ప్రముఖులు, సినిమాకు సంబంధించిన వారు కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు.

Chiranjeevi : TNR కుటుంబానికి ఆర్ధిక సాయం చేసిన మెగాస్టార్.. కనీటిపర్యంతం అయిన TNR సతీమణి..
Chiru
Rajeev Rayala
|

Updated on: May 11, 2021 | 8:45 PM

Share

Chiranjeevi : కరోనా మహమ్మారి ఎంతోమందిని బలితీసుకుంటుంది. ఇప్పటికే చాలామంది ప్రముఖులు, సినిమాకు సంబంధించిన వారు కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. ఇటీవల కోవిడ్ తో పోరాడి ప్రముఖ జర్నలిస్ట్ టీఎన్ఆర్ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ టిఎన్ఆర్ అంటూ తనదైన శైలిలో ఇంటర్వ్యూలు చేస్తూ చాలా పాపులర్ అయ్యారు. యూ ట్యూబ్ లో ఈయన ఇంటర్వ్యూలకు మిలియన్స్ కొద్దీ వ్యూస్ వస్తుంటాయి. ఓ ప్రముఖ యూ ట్యూబ్ ఛానెల్ కోసం ఈయన పని చేస్తుంటారు. ఇండస్ట్రీలో తనకంటూ మంచి పేరు సంపాదించుకున్న మృధుస్వభావి టీఎన్ఆర్.

ఇంటర్వ్యూలతోనే కాదు సినిమాల్లోనూ నటించి ఆకట్టుకున్నారు టిఎన్ఆర్. కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన టిఎన్ఆర్.. వైద్యం తీసుకున్న తర్వాత నయమైంది. అయితే ఉన్నట్లుండి ఈయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్ లో ని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. టీఎన్ఆర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని.. పల్స్ రేట్ బాగా పడిపోయిందని ఆదివారం ఆయన స్నేహితులు తెలిపారు. ఈ క్రమంలో సోమవారం( మే 10న ) ఉదయం ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో ఆయన కన్నుముశారు.  టీఎన్ఆర్ మృతికి పలువురు సినీ ప్రముఖులు, జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేసారు. మెగాస్టార్ చిరంజీవి టిఎన్ఆర్ కన్నుమూశారన్న వార్త తెలుసుకొని దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. టిఎన్ఆర్ కుటుంబసభ్యులకు లక్షరూపాయలు ఆర్ధిక సాయం అందించారు మెగాస్టార్. టిఎన్ఆర్ కు తన 200వ ఇంటర్వ్యూ చిరంజీవి తో చేయాలని కోరిక ఉండేదని ఆ కోరిక తీరకుండానే కన్నుమూశారని టిఎన్ఆర్ సతీమణి కన్నీటిపర్యంతం అయ్యారు.

మరిన్ని ఇక్కడ చదవండి.

Kajal Aggarwal: హీరోయిన్ల‌కు పెళ్ల‌యితే సినిమాలు త‌గ్గుతాయా?.. ఆ మాట అనేముందు ఒక్క‌సారి కాజ‌ల్ ఫిల్మోగ్ర‌ఫీ చూడండి

Thalapathy Vijay: దళపతి విజయ్ తో దిల్ రాజు సినిమా..మాస్టర్ రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవుతారు..

Actress Pooja Hegde: పవర్ స్టార్ ను ఫాలో అవుతున్న బుట్టబొమ్మ పూజా.. ఏం చేసిందో తెలుసా…