Shivani Rajasekhar: తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికై ఉంటే మరింత సంతోషించేదాన్ని.. మిస్‌ ఇండియా పోటీలపై శివాని..

సాధారణంగా మోడలింగ్‌లోకి అడుగుపెట్టి ఆతర్వాత వెండితెరకు పరిచయమవుతారు. అయితే సీనియర్‌ హీరో డాక్టర్‌ రాజశేఖర్‌, జీవితల పెద్ద కుమార్తె శివానీ రాజశేఖర్‌ (Shivani Rajasekhar) మాత్రం మొదట సిల్వర్‌ స్ర్కీన్‌ మీద ఎంట్రీ ఇచ్చింది.

Shivani Rajasekhar: తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికై ఉంటే మరింత సంతోషించేదాన్ని.. మిస్‌ ఇండియా పోటీలపై శివాని..
Shivani
Follow us

|

Updated on: May 06, 2022 | 8:49 AM

సాధారణంగా మోడలింగ్‌లోకి అడుగుపెట్టి ఆతర్వాత వెండితెరకు పరిచయమవుతారు. అయితే సీనియర్‌ హీరో డాక్టర్‌ రాజశేఖర్‌, జీవితల పెద్ద కుమార్తె శివానీ రాజశేఖర్‌ (Shivani Rajasekhar) మాత్రం మొదట సిల్వర్‌ స్ర్కీన్‌ మీద ఎంట్రీ ఇచ్చింది. ఆతర్వాత మోడల్‌గా మారి రాణిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఫెమినా మిస్‌ ఇండియా-2022 పోటీల్లో శివానీ పాల్గొన్న సంగతి తెలిసిందే. గత నెలలో జరిగిన ఈ పోటీల్లో ఈ ముద్దుగుమ్మ మిస్‌ తమిళనాడుగా ఎంపికైంది. అయితే తెలుగమ్మాయిగా ఉండి తమిళనాడు తరఫున పోటీల్లో పాల్గొని రెప్రజెంట్‌ చేయడమేంటని కొందరు శివానీపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఈ విషయంపై స్పందించింది శివాని. తన తండ్రి రాజశేఖర్‌ నటించిన శేఖర్‌ (Sekhar) మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో మాట్లాడుతూ మిస్‌ ఇండియా పోటీలపై స్పష్టతనిచ్చింది.

అందుకే తమిళనాడు నుంచి..

‘తెలంగాణలో ఉంటున్న నేను ఈ రాష్ట్రం నుంచే మిస్‌ ఇండియా పోటీల్లో పాల్గొనాలనుకున్నాను. అయితే పోటీ నిర్వాహకులు అప్లికేషన్స్‌లో మల్టిపుల్‌ ఆప్షన్స్‌ ఇచ్చారు. దీంతో నేను ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు తమిళనాడును కూడా అప్షన్‌గా ఎంచుకున్నాను. నిర్వాహకులు కూడా నన్ను తమిళనాడు నుంచే ఎంపిక చేశారు. అందువల్లే మిస్ తమిళనాడుగా ఎంపికయ్యాను. అయితే ఓ తెలుగు అమ్మాయిగా ఈ రెండు రాష్ట్రాల నుంచి నన్ను ఎంపిక చేసి ఉంటే మరింత సంతోషించేదాన్ని. నేను చెన్నైలోనే పుట్టాను. అక్కడే పెరిగాను. తమిళనాడు కూడా నాకు సొంత రాష్ట్రం లాంటిదే. వీటిన్నిటినీ మించి భారత దేశాన్ని రెప్రజెంట్ చేయడాన్ని నేను గర్వంగా భావిస్తాను’ అని తనదైన శైలిలో సమాధానమిచ్చిందీ అందాల తార. కాగా రాజశేఖర్‌ నటించిన 91వ చిత్రం శేఖర్‌. ఈ సినిమాలో రాజశేఖర్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్‌, గ్లింప్స్‌, ట్రైలర్‌​ఆకట్టుకుంటున్నాయి. మే20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

IPL 2022: తగ్గేదేలే అంటోన్న డేవిడ్‌ భాయ్‌.. పాత జట్టుపై ప్రతీకారంతో పాటు ఆ ప్రపంచ రికార్డును కూడా ఖాతాలోకి వేసుకున్నాడుగా..

Inter Exams 2022: మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఇంటర్‌ పరీక్షలు.. విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన విషయాలివే..

Gold & Silver Price Today: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్‌.. మళ్లీ భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ