RRR : జక్కన్న నిర్ణయం కోసం వేయికళ్ళతో ఎదురుచూస్తున్న స్టార్ హీరోలు.. ఎందుకంటే
దర్శక ధీరుడు జక్కన మీదే ఇప్పుడు ఫోకస్ పెట్టరు టాలీవుడ్ స్టార్ హీరోలంతా .. ఎప్పటికప్పుడు రాజమౌళి మూమెంట్స్ మీదే ఓ కన్నేసి ఉంచారు మిగతా స్టార్ హీరోలంతా...
RRR : దర్శక ధీరుడు జక్కన మీదే ఇప్పుడు ఫోకస్ పెట్టరు టాలీవుడ్ స్టార్ హీరోలంతా .. ఎప్పటికప్పుడు రాజమౌళి మూమెంట్స్ మీదే ఓ కన్నేసి ఉంచారు మిగతా స్టార్ హీరోలంతా… ఇంక్లూడింగ్ మెగాస్టార్. కొంతమందయితే.. వెయిటింగ్ దశ దాటి ఇంకా ముందుకొచ్చేశారు. ఇంతకు అసలు విషయం ఏంటంటే. నిండు చందురుడు ఒకవైపు… చుక్కలు ఒకవైపు..! భారీతనం లెక్కల్లో ట్రిపులార్‌కీ మిగతా సినిమాలకూ వుండే తేడా ఇది. అందుకే.. ఈసారి దసరాకి రావడం పక్కా అని జక్కన్న నుంచి అనౌన్స్‌మెంట్ రాగానే.. దాన్ని బట్టే మిగతా సినిమాలన్నీ తేదీలు వెతుక్కున్నాయి. ఇప్పుడైతే కథ మారింది. దశమికి ట్రిపులార్ రాకపోవచ్చన్న వార్తలు ఇండస్ట్రీలో కొత్త కదలికల్ని షురూ చేశాయి.
మామూలుగా అయితే… ట్రిపులార్ డేట్‌కి వారం అటూఇటూ ఏ సినిమా కూడా వచ్చే ధైర్యం చేయదు. ఇప్పుడు మాత్రం సైలెంట్‌గా ఆ దసరా సీజన్‌పైనే ఈగల్లా ముసిరేశాయి మిగతా సినిమాలు. నిన్న ట్రిపులార్ రిలీజ్ డేట్ అక్టోబర్13 మరుసటిరోజు మీదే కర్చీఫేసింది మహాసముద్రం. శర్వా, సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తున్న ఈ మూవీని దేవాకట్టా డైరెక్ట్ చేస్తున్నారు. చాన్నాళ్లుగా అటకెక్కి కూర్చున్న అఖిల్… మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా డేర్ చేశారు. అక్టోబర్ 8న వస్తున్నా అంటూ దసరా వీకెండ్‌ని క్యాప్చర్ చేశాడు అక్కినేని హీరో. ఇలాగే.. సీనియర్ హీరోలు కూడా ట్రిపులార్‌ని రౌండప్ చేసే పనిలో వున్నారట. సినిమా ఫైనల్ స్టేజ్‌లో వున్నా.. రిలీజ్ డేట్‌పై దాగుడుమూతలాడుతున్న ఆచార్య.. అక్టోబర్ ఫస్టాఫ్‌ని ఓరకంట గమనిస్తున్నారు. ప్రొడక్షన్లో దూకుడు పెంచిన అఖండదీ అదే దారి. సో… జక్కన్న చెప్పకపోయినా… ట్రిపులార్ వాయిదా ఈవిధంగా కన్‌ఫమ్ అవుతోందన్నమాట.
మరిన్ని ఇక్కడ చదవండి :