AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raj Tarun-Lavanya: రాజ్ తరుణ్- లావణ్య కేసులో ఊహించని ట్విస్ట్.. హీరోయిన్ మాల్వీపై సంచలన ఆరోపణలు

ఇటీవల ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ లావణ్య పోలీసులను పరుగులు పెట్టించింది. తాజాగా ఈ కేసులో మరో బిగ్ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. హీరో రాజ్ తరుణ్-లావణ్య-మాల్వి మల్హోత్రా ఎపిసోడ్‌పై ముంబైకు చెందిన అసిస్టెంట్ ప్రొడ్యూసర్ యోగేశ్ తల్లి సంచలన వీడియో రిలీజ్ చేసింది.

Raj Tarun-Lavanya: రాజ్ తరుణ్- లావణ్య కేసులో ఊహించని ట్విస్ట్.. హీరోయిన్ మాల్వీపై సంచలన ఆరోపణలు
Tollywood Actor Raj Tarun Lover Row
Basha Shek
|

Updated on: Jul 16, 2024 | 6:44 AM

Share

రాజ్ తరుణ్- లావణ్యల లవ్ ఎపిసోడ్ రోజుకోక మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ విషయంలో పోలీసులకు ట్విస్టుల మీద ట్విస్టులు ఎదరవుతున్నాయి. ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలతో ముగ్గురిపై కేసులు కూడా నమోదయ్యాయి. మొదట హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో సహా పలువురిపై లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత రాజ్ తరుణ్ తిరిగి లావణ్యపై ఫిర్యాదు చేశాడు. మరోవైపు తన పరువును బజారుకీడ్చుతోందంటూ, తన తమ్ముడిని బెదిరిస్తుందంటూ లావణ్యపై కేసు పెట్టింది హీరోయిన్ మాల్వీ మల్హోత్రా. దీంతో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ఈ కేసులో రాజ్ తరుణ్ ను A1 గా చేర్చారు. మరోవైపు ఇటీవల ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ లావణ్య పోలీసులను పరుగులు పెట్టించింది. తాజాగా ఈ కేసులో మరో బిగ్ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. హీరో రాజ్ తరుణ్-లావణ్య-మాల్వి మల్హోత్రా ఎపిసోడ్‌పై ముంబైకు చెందిన అసిస్టెంట్ ప్రొడ్యూసర్ యోగేశ్ తల్లి సంచలన వీడియో రిలీజ్ చేసింది.

ఇవి కూడా చదవండి

ఇందులో ఆమె హీరోయిన్ మాల్వీ మల్హోత్రా పై సంచలన ఆరోపణలు చేసింది. ప్రేమ పేరుతో తమ ఆస్తులన్నింటినీ లాక్కుందని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రేమ పేరుతో వెంట పడుతున్నాడంటూ తమ కుమారున్ని జైలుకు పంపించిందని వెల్లడించింది. యోగేష్ ను మాల్వీ ట్రాప్ చేసి ప్రేమలో పడేసిందని, ఆ తర్వాత ఆస్తులన్నింటినీ లాక్కుందని ఆరోపించింది. ఆ తర్వాత తప్పుడు కేసులతో తమ కుమారుడిని జైలుకు పంపించిందంని వాపోయింది. నాలుగేళ్లుగా మాల్వీ తమను ఇబ్బంది పెడుతోందంటూ కంటతడి పెట్టిందామె .

కాగా.. 2020లో ముంబైలో ఉన్నప్పుడు హీరోయిన్ మాల్వీ మల్హోత్రాపై యోగేష్ కత్తితో దాడి చేయడం సంచలనం సృష్టించింది. మాల్వీ పెళ్లికి ఒప్పుకోవట్లేదని దాడి చేశాడంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. అప్పుడు జరిగిన అన్ని విషయాలను యోగేష్ తల్లి ఇప్పుడు మీడియా ఎదుట బయటపెట్టడం సంచలనం రేపుతోంది. మరి ఈ తీవ్రమైన ఆరోపణలపై రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా ఎలా స్పందిస్తారో చూడాలి.

తిరగబడరా సామీ సినిమాలో రాజ్ తరుణ్ తో హీరోయిన్ మాల్వి మల్హోత్రా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.