AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister Harish Rao: ‘చిచ్చా’ మూవీ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసిన మంత్రి హరీష్ రావు.. రాహుల్ స్టార్ అవుతాడంటూ కితాబు..

తెలుగులో సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ త్వరలో హీరోగా మారబోతున్నాడు. తెలంగాణ యాసలో రాహుల్ పడే పాటలను ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇక టాలీవుడ్ లో కూడా ఎన్నో

Minister Harish Rao: 'చిచ్చా' మూవీ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసిన మంత్రి హరీష్ రావు.. రాహుల్ స్టార్ అవుతాడంటూ కితాబు..
Chicha
Rajeev Rayala
|

Updated on: Mar 20, 2021 | 7:17 PM

Share

Minister Thaneeru Harish Rao: తెలుగులో సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ త్వరలో హీరోగా మారబోతున్నాడు. తెలంగాణ యాసలో రాహుల్ పడే పాటలను ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇక టాలీవుడ్ లో కూడా ఎన్నో సినిమాలకు అద్బుతమైన పాటలు పాడాడు రాహుల్. ప్రైవేట్ ఆల్బమ్స్ తో పాపులార్ అయిన రాహుల్ బిగ్ బాస్ షో పాటిస్పెట్ చేసి బిగ్ బాస్ 3 విన్నర్ గా నిలిచాడు. సింగర్ గానే కాకుండా బిజినెస్ మ్యాన్ గాను రాణించాలని చూస్తున్నాడు. ఈ క్రమంలోనే ఊకో కాకా అనే మెన్స్ వేర్ బ్రాండ్ స్టోర్ ను ప్రారంభించాడు. అలాగే రాహుల్ సిప్లిగంజ్ అతని మిత్రుడు శ్రీకాంత్ ఇద్దరు కలిసి క్రియేట్ చేసిన ‘ఊకో కాకా’ (మెన్స్ వేర్) బ్రాండ్ స్టోర్ ని సిద్ధిపేట లో ఏర్పాటు చేసారు. ఈ స్టార్ ను తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.

అలాగే రాహుల్ సిప్లిగంజ్ హీరోగా ఆర్.ఎస్. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ‘మల్లిక్ కందుకూరి’ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం చిచ్చా.ఈ చిత్రానికి సంబంధించిన సినిమా టైటిల్, మోషన్ పోస్టర్ ని కూడా మంత్రి ‘టి. హరీష్ రావు’ సిద్దిపేట లో లాంచ్ చేసారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. చిత్రయూనిట్ కు అభినందనలు తెలిపారు. అలాగే సిద్దిపేటలో షూటింగ్ చేయడానికి అందమైన లొకేషన్స్ ఉన్నాయని, అలాగే చాలా మంది కళాకారులు కూడా ఇక్కడ ఉన్నారని అన్నారు. అలాగే రాహుల్ తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ గా ఎదగాలని అన్నారు హరీష్ రావు. అనంతరం రాహుల్ అభిమానులతో ‘చిచ్చా’ టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేయించారు.

హరీష్ రావు స్పీచ్

మరిన్ని ఇక్కడ చదవండి :

Keerthy Suresh : కనిపించకుండాపోయిన కీర్తిసురేష్ .. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన స్టార్ హీరో.. అసలేమైంది

Singer Sunitha: పుత్రికోత్సాహంలో సింగర్ సునీత.. అందమైన పాటపాడిన శ్రేయ.. వీడియో వైరల్

Yuvarathnaa Trailer : ఆకట్టుకుంటున్న యువరత్న ట్రైలర్.. అదరగొట్టిన పునీత్ రాజ్

.