Rahul Sipligunj: హైదరాబాద్ బస్తీ నుంచి ఆస్కార్ స్టేజ్ వరకు.. వాటే జర్నీ చిచ్చా..

ధూల్ పేట్‌లో పుట్టిన కుర్రాడు.. ప్రపంచం తెలియని పిల్లాడు.. చిన్నపుడు ఏదో అలా పాటలు పాడుకుంటూ తిరిగాడు.. ఎన్నో కష్టాల్ని దాటాడు.. అదే స్పూర్థితో ఏడు సముద్రాలు దాటి తన పేరు విస్తరించుకున్నారు.. వినడానికే ఎంతో ఇన్స్‌స్పిరేషనల్‌గా ఉంది కదా..! ఈ ఇంట్రడక్షన్ అంతా రాహుల్ సిప్లిగంజ్ గురించే. ధూల్ పేట్ టూ లాస్ ఎంజిల్స్ వరకు సాగిన రాహుల్ జర్నీపై స్పెషల్ ఫోకస్..

Rahul Sipligunj: హైదరాబాద్ బస్తీ నుంచి ఆస్కార్ స్టేజ్ వరకు.. వాటే జర్నీ చిచ్చా..
Rahul Sipligunj With NTR and Priyanka Chopra
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 12, 2023 | 5:46 PM

రాహుల్ సిప్లిగంజ్.. ఇప్పుడు ఈ పేరు తెలియని సంగీత ప్రియుడు ఉండరేమో..? కానీ ఒకప్పుడు ఇదే రాహుల్ తన పేరు కనీసం 10 మందికైనా తెలియాలని ఎంత తపనపడ్డారో..? తన గురించి ఎవరైనా.. ఎప్పుడైనా మాట్లాడుకుంటారా..? ఇండస్ట్రీలో చర్చ జరుగుతుందా అని వేయి కళ్లతో వేచిచూసారు పాపం. అలాంటి స్టేజ్ నుంచి ఆస్కార్ వరకు రాహుల్ జర్నీ సాగిందంటే.. ఎంత కష్టపడి ఉంటారో కదా. ఒక ఆర్డినరీ కుర్రాడు.. బస్తీలో తిరిగే పోరగాడు.. గల్లీల్లో పాటలు పాడుకుంటూ చిచోరా పనులు చేస్తుండేవాడు.. ధూల్ పేట్ ఏరియాలో చిన్న చిన్న అల్లర్లు చేసాడు.. అలాంటి కుర్రాడు ఇండస్ట్రీకి వచ్చి.. తనకంటూ గుర్తింపు తెచ్చుకుని ఈ రోజు ఆస్కార్ స్టేజీపై పర్ఫార్మ్ చేస్తున్నారు. అసలు ఈ ఛేంజోవర్ తలుచుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి కదా. ఇవన్నీ రాహుల్ లైఫ్‌లో జరిగాయి.

ఎన్టీఆర్ ఎంత పెద్ద హీరో అయినా అయ్యుండొచ్చు.. రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ అయ్యుండొచ్చు కానీ వాళ్లకే ఇంకా ఆస్కార్ స్టేజ్ ఎక్కే అవకాశం రాలేదు. అలాంటిది గల్లీ పోరగాడుగా జర్నీ మొదలుపెట్టిన రాహుల్.. ఆస్కార్ స్టేజీపై ప్రపంచం చూస్తుండగానే తన గాత్రం వినిపించబోతున్నారు. ఇంతకంటే లైఫ్‌లో హై మూవెంట్ అనేది ఉంటుందా..? ధూల్ పేట్ బస్తీలో జీవితం మొదలుపెట్టి.. ఆస్కార్‌లో పర్ఫార్మెన్స్ అంటే అంతకంటే ఏం సాధించాలి..

ధూల్ పేట్‌లో పుట్టి పెరిగి.. ఆ తర్వాత విజయ్ నగర్ కాలనీలోని కోటమ్మ బస్తీకి మారి.. ఇప్పుడు బంజారా హిల్స్‌లో సెటిల్ అయ్యారు రాహుల్. పక్కా మిడిల్ క్లాస్ మెంటాలిటీతో పెరిగిన ఈ కుర్రాడు.. తన పాటల్లోనూ అదే చూపించాడు. హైదరాబాద్‌లోని ఓ చిన్న బస్తీలో ఉండే రాహుల్ సిప్లిగంజ్ కెరీర్‌కు పెద్ద బ్రేక్ ఇచ్చింది బిగ్ బాస్ రియాలిటీ షో. అప్పటి వరకు ఆయన పాటలు పాడుతున్నా.. ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నా.. రాహుల్ సిప్లిగంజ్ అనే వ్యక్తి జీవితం మలుపు తిరిగింది మాత్రం రియాలిటీ షోతోనే. అక్కడ్నుంచే ఈ సింగర్ లైఫ్ స్టైల్ మారిపోయింది. 2009లో నాగ చైతన్య హీరోగా వచ్చిన జోష్ సినిమాతోనే రాహుల్ సిప్లిగంజ్ జర్నీ కూడా మొదలైంది. అందులో కాలేజ్ బుల్లోడా అనే పాటతో పరిచయం అయ్యారు రాహుల్. 20 ఏళ్ళ వయసులో సింగర్ అయిన రాహుల్.. గుర్తింపు కోసం మాత్రం చాలా ఏళ్ళ పాటు చూసారు. దమ్ములో టైటిల్ సాంగ్ పాడినా.. రచ్చలో సింగరేణి ఉంది అంటూ మాస్ సాంగ్ పాడినా.. రాహుల్ దశ మార్చింది మాత్రం బిగ్ బాస్ రియాలిటీ షో.

ఇండస్ట్రీలో రాహుల్ సిప్లిగంజ్‌కు గురువు, మెంటర్ అన్నీ కీరవాణినే. మొదట్నుంచీ తన సినిమాల్లో రాహుల్‌కు మంచి పాటలిచ్చారు కీరవాణి. అలాగే మ్యూజిక్ డైరక్టర్ కోటి సైతం ఈయనకు ఎప్పుడూ సపోర్ట్‌గానే ఉన్నారు. పైగా తెలుగులో ప్రైవేట్ ఆల్బమ్స్‌కు క్రేజ్ తీసుకొచ్చిన అతి తక్కువ మంది సింగర్స్‌లో రాహుల్ ముందుంటారు. ఈయన పాటలు మిలియన్ల కొద్దీ వ్యూస్ తెచ్చుకున్నాయి. యూ ట్యూబ్‌లో పాపులర్ అవుతున్న సమయంలోనే బిగ్ బాస్ షో ఆఫర్ దక్కించుకున్నారు రాహుల్. అక్కడ కూడా మనోడి ఆటిట్యూడ్ బాగా ప్లస్ అయింది. పైగా ఆ షోలో పునర్నవితో రొమాన్స్ వర్కవుట్ అయింది. తన పాటలు, ఎనర్జీతో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు రాహుల్. అలా బిగ్ బాస్ విన్నర్‌గా బయటికి వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో తన జర్నీ మరింత ముందుకు తీసుకెళ్లారు రాహుల్.

కేవలం సింగర్‌గా అయితే రాహుల్ సిప్లిగంజ్ ఇంత పాపులర్ అయ్యేవారు కాదు. కానీ ఈయనలో సింగర్‌తో పాటు చాలా కళలున్నాయి. ముఖ్యంగా ఓ గల్లీ పోరగాడు ఎలా అయితే ఉంటాడో.. అచ్చంగా అలాగే ఉంటారు రాహుల్. సెలబ్రిటీ స్టేటస్ వచ్చిన తర్వాత కూడా ఈయనలో మార్పు రాలేదు. అదే మిగిలిన సింగర్స్ నుంచి రాహుల్‌ను సపరేట్ చేసింది. టాలీవుడ్‌లో చాలా మంది సింగర్స్ ఉన్నారు కానీ రాహుల్ సిప్లిగంజ్ మాత్రం ప్రత్యేకం. మొదట్నుంచి కూడా తోటి సింగర్స్ మాదిరి ఎప్పుడూ ఆలోచించలేదు ఈయన. డిఫెరెంట్ ఆలోచనలతోనే తనకంటూ ప్రత్యేకంగా క్రేజ్ తెచ్చుకున్నారు. అంతా సినిమా పాటలతోనే కెరీర్ ముందుకెళ్తుందనే ఆలోచనలో ఉంటే.. రాహుల్ మాత్రం ప్రైవేట్ ఆల్బమ్స్‌తో పాపులర్ అయ్యారు.

ఆ తర్వాత బిగ్ బాస్ విన్నర్ అవ్వడంతో రాహుల్ ఇమేజ్ మరింత పెరిగింది. అయితే దానికంటే ఎక్కువ పాపులర్ అయ్యేలా చేసింది ఆయన గొడవలు.. కాంట్రవర్సీలు. గల్లీ బాయ్ పేరుకు తగ్గట్లుగానే బయట గొడవలు పడ్డాడు.. తన్నులు తిన్నాడు.. తాను కొట్టాడు.. ఇలా ఏది పడితే అది చేసాడు ఈ కుర్రాడు. ముఖ్యంగా ఆ మద్య పబ్‌లో జరిగిన గొడవ రాహుల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ సెన్సేషన్. పబ్‌లో జరిగిన గొడవల సమయంలో రాహుల్ సిప్లిగంజ్ పేరు బయటికి మరోలా వచ్చింది. అతడిదే తప్పు అన్న వాళ్లున్నారు.. కాదు కాదు అవతలి వాళ్ల తప్పును నిలదీసారు అన్నవాళ్లున్నారు. కారణమేదైనా కావచ్చు మనోడు మాత్రం కాంట్రవర్సీలతో పాపులర్ అయిపోయారు. అయితే ఆ ప్రభావం తన కెరీర్‌పై పడకుండా జాగ్రత్త పడటం అనేది రాహుల్ తెలివితేటలకు నిదర్శనం.

రాహుల్ సిప్లిగంజ్ అంటే బయటి ప్రపంచానికి తెలిసి కేవలం సింగర్ మాత్రమే. కానీ ఈయనలో చాలా కోణాలున్నాయి. అది కూడా తన క్లోజ్ సర్కిల్‌కు మాత్రమే తెలుసు. రాహుల్‌ను దగ్గర్నుంచి చూసిన వాళ్లు కానీ.. అతడి లైఫ్‌లోని కష్టాలు తెలిసిన వాళ్లు కానీ.. ఈ కుర్రాడి గురించి చాలా గొప్పగా చెప్తుంటారు. సింగర్‌గా మొదలై.. బిజినెస్‌లోనూ రప్ఫాడిస్తున్నారు ఈ ధూల్ పేట్ పోరగాడు. రాహుల్ సిప్లిగంజ్ వృతిపరంగా సింగర్ అయ్యుండొచ్చు కానీ ఆయనలో ఇంకా చాలా కోణాలైతే ఉన్నాయి. వాళ్ల నాన్న బార్బర్. రాహుల్‌కు ఆ వృత్తి కూడా వచ్చు. పైగా బిగ్ బాస్‌లో ఉన్నపుడు చాలా మందికి స్టైలిష్ హెయిర్ కట్ చేసి ఔరా అనిపించారు. దాంతో పాటు ఛాయ్ బిజినెస్ చేస్తూ రప్ఫాడిస్తున్నారు రాహుల్. సిటీలో ఫ్రెండ్స్‌తో కలిసి ఈ బిజినెస్ చేస్తున్నారీయన.

ఏ బిజినెస్ చేసినా రూట్స్ మాత్రం మరిచిపోరు రాహుల్. ఆయన ఆలోచనలు గల్లీ పోరగాడిలానే ఉంటాయి. దాంతో పాటు క్లోత్స్ షోరూం కూడా ఉంది రాహుల్‌కు. ఓవైపు పాటలు పాడుతూనే.. మరోవైపు తన బిజినెస్ కూడా కంటిన్యూ చేస్తున్నారు రాహుల్. ఇప్పటి వరకు రచ్చ, దమ్ము, రంగస్థలం, ఇస్మార్ట్ శంకర్, ట్రిపుల్ ఆర్ లాంటి సినిమాల్లో రాహుల్ పాడిన చార్ట్ బస్టర్స్ అయ్యాయి.కేవలం గాయకుడిగానే కాకుండా.. నటుడిగానూ బిజీ అవుతున్నారు రాహుల్. తాజాగా కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండలో కీలక పాత్రలో నటిస్తున్నారు రాహుల్. అందులో శివాత్మిక రాజశేఖర్‌కు జోడీగా నటిస్తున్నారు రాహుల్. దాంతో పాటు మరో రెండు సినిమాల్లో హీరోగానూ ఎంపికయ్యారు.

ఇప్పటి వరకు రాహుల్ సిప్లిగంజ్ లైఫ్ ఏంటనేది మనకు మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు ప్రపంచమంతా ఈయన గురించి మాట్లాడుకుంటుంది. ఆస్కార్ స్టేజ్‌పై లైవ్ పర్ఫార్మెన్స్ అంటే మాటలు కాదు.. కనీసం కలలో కూడా ఊహించని విషయం అది.. ఇంతకంటే పెద్ద విజయం రాహుల్ లైఫ్‌లో ఉండకపోవచ్చు. ప్రపంచం చూస్తుండగా.. నాటు నాటు పాటతో రచ్చ చేయడానికి రెడీ అవుతున్నారు ఈ ధూల్ పేట్ కుర్రాడు. నాటు నాటు పాట విడుదలైనపుడు రాహుల్ సిప్లిగంజ్ కూడా అనుకుని ఉండరు ఈ పాట ఆస్కార్ అంత దూరం వెళ్తుందని..! కచ్చితంగా హిట్ అవుతుందని నమ్మారు కానీ ఆస్కార్ వరకు వెళ్లే అవకాశం వస్తుందని మాత్రం ఊహించలేదని ఆయనే చెప్పారు. అంత దూరం మన పాటను తీసుకెళ్ళిన కీరవాణి, రాజమౌళికి మనస్పూర్థిగా థ్యాంక్స్ చెప్పారు రాహుల్. ఆ పాట కారణంగానే ఈ రోజు అమెరికాలో హాట్ ఫేవరేట్ అయ్యారు ఈ బస్తీ పోరడు.

నాటు నాటు విడుదలైన మరుక్షణం నుంచే వైరల్ అవ్వడం మొదలైంది. ముఖ్యంగా పాటలో లిరిక్స్ అంత అద్భుతంగా రాసిన చంద్రబోస్.. వాటిని అంతకంటే అద్భుతంగా పలికించిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవకు ఈ క్రెడిట్ వెళ్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈయన విజయంపై కుటంబ సభ్యులే కాదు.. అతడి స్నేహితులు, సన్నిహితులంతా గర్వంతో ఉప్పొంగిపోతున్నారు. చిన్నపుడు తనకు ఆస్కార్ స్పెల్లింగ్ కూడా తెలియదని చెప్పారు రాహుల్. అలాంటిదిప్పుడు ఆయన అదే వేదికపై పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు అంటే అంతకంటే అతడి లైఫ్‌లో నెక్ట్స్ లెవల్ ఏముంటుంది..? కచ్చితంగా ఈ పాటకు ఆస్కార్ వస్తుంది.. దేశం మీసం మెలేస్తుందని నమ్మకంగా ఉన్నారు ఫ్యాన్స్. ఇదే జరిగితే తెలుగు వాళ్లకు.. తెలుగు సినిమాకు అంతకంటే ఇంకేం కావాలి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి..