“ముంబై వెళ్తే రేప్ చేస్తారని భ‌య‌పెట్టారు”

న‌టి రాధికా ఆప్టే ఏం చేసినా సంచ‌ల‌న‌మే. తెర‌పై సంచ‌ల‌న పాత్ర‌లు చేయ‌డం, తెర బ‌య‌ట అంతే సెన్సేష‌న‌ల్ కామెంట్స్ చేయ‌డం ఆమె స్టైల్.

ముంబై వెళ్తే రేప్ చేస్తారని భ‌య‌పెట్టారు
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 09, 2020 | 4:42 PM

Radhika Apte Comments On Rape : న‌టి రాధికా ఆప్టే ఏం చేసినా సంచ‌ల‌న‌మే. తెర‌పై సంచ‌ల‌న పాత్ర‌లు చేయ‌డం, తెర బ‌య‌ట అంతే సెన్సేష‌న‌ల్ కామెంట్స్ చేయ‌డం ఆమె స్టైల్. ఎప్పుడూ వార్తల్లో ఉంటూ, సోష‌ల్ మీడియాలో కూడా సెగ‌లు రేపుతుంది ఈ బ్యూటీ. ఆ మ‌ధ్య తెలుగు అగ్ర‌హీరో త‌న‌తో బ్యాడ్‌గా బిహేవ్ చేశాడంటూ ప్ర‌కంప‌న‌లు రేపింది. కాగా బాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ గురించి చాలామంది ఆరోప‌ణ‌లు చేశారు. కానీ రాధికా ఆప్టే మాత్రం హిందీ ప‌రిశ్ర‌మ‌ను అంత బ్యాడ్‌గా చూడాల్సిన అవ‌స‌రం లేద‌ని ఇటీవ‌ల ఓ ఇంట‌ర్య్వూలో చెప్పుకొచ్చింది. త‌న వ‌ద్ద కూడా బాలీవుడ్ గురించి కొంద‌రు త‌ప్పుగా ప్ర‌చారం చేశార‌ని చెప్పుకొచ్చింది. అక్క‌డ వెళ్తే అత్యాచారం చేస్తార‌ని త‌న‌ను కొందరు భ‌య‌పెట్టిన‌ట్లు తెలిపింది. త‌న స్వ‌స్థ‌లం పూణే అని..అక్కడి నుంచి సినిమా అవ‌కాశాల కోసం ముంబై వెళ్లాల‌నుకున్నప్పుడు ఇలా చెప్పి భ‌య‌పెట్టే ప్ర‌య‌త్నం చేశార‌ని వెల్ల‌డించింది.

సినిమా పరిశ్ర‌మ గురించి బ‌య‌ట ప్ర‌జ‌ల‌కు మంచి అభిప్రాయం లేద‌ని, అక్క‌డ జ‌రిగేది కంటే..బ‌య‌ట మాట్లాడుకునేదే ఎక్కువ‌ని అభిప్రాయ‌ప‌డింది. బ‌య‌ట కూడా ఇండ‌స్ట్రీలో ఉండే స‌మ‌స్య‌లు ఉంటాయ‌ని, అంద‌రివీ సాధార‌ణ జీవితాలే అని చెప్పుకొచ్చింది ఈ హాట్ బ్యూటీ.

Also Read : టీటీడీలో 743 మందికి కరోనా పాజిటివ్, ఐదుగురు మృతి