గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న మ‌హేష్

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడత కార్యక్రమం మహా ఉద్యమంలా కొనసాగుతుంది. ఆయన పిలుపు మేరకు పలువురు సినీ ప్రముఖులు, క్రీడాకారులు, వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు ముందుకు..

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న మ‌హేష్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 09, 2020 | 3:32 PM

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడత కార్యక్రమం మహా ఉద్యమంలా కొనసాగుతుంది. ఆయన పిలుపు మేరకు పలువురు సినీ ప్రముఖులు, క్రీడాకారులు, వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు ముందుకు వచ్చి మొక్కలు నాటడమే కాకుండా బాధ్యత తీసుకోని ఇతరుల చేత గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను పూర్తి చేయించడం జరుగుతుంది. తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు పాల్గొన్నారు. త‌న‌ పుట్టిన రోజు ఇంత కంటే గొప్ప‌గా సెల‌బ్రేట్ చేసుకోలేన‌ని ట్వీట్ చేశాడు ప్రిన్స్‌. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో తార‌క్‌, విజ‌య్‌, శృతి హాస‌న్‌ను నామినేట్ చేశారు మ‌హేష్ బాబు. ఈ కార్య‌క్ర‌మం చెయిన్ కంటిన్యూ కావాల‌ని, స‌రిహ‌ద్దులు దాటాల‌ని కోరారు మ‌హేష్ బాబు. ప‌చ్చ‌ద‌నం వైపు అడుగులు వేద్దామ‌ని మ‌హేష్ బాబు పిలుపునిచ్చారు. ఎంపీ సంతోష్ కుమార్‌ను అభినందించారు.

Read More:

స్వ‌ర్ణ ప్యాలెస్ ఘ‌ట‌నః మృతుల వివ‌రాలు ఇవే

ఒకే సినిమాలో అక్కా చెల్లెళ్లుగా ర‌ష్మిక, స‌మంత‌?