5 నిమిషాల్లో ‘346 సూపర్ స్టార్ కృష్ణ సినిమా పేర్లు’ చెప్పిన చిన్నారి
ఐదు నిమిషాల్లో 'సూపర్ స్టార్ కృష్ణ 346 సినిమా పేర్లు' చెప్పి అబ్బుర పరుస్తోంది ఓ చిన్నారి. తన అద్భుతమైన జ్ఞాపకశక్తితో ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది. విజయవాడకి చెందిన మున్నంగి హాసిని వయస్సు 10 ఏళ్లు. ఐకాన్ పబ్లిక్ స్కూల్‌లో ఐదో తరగతి..
ఐదు నిమిషాల్లో ‘సూపర్ స్టార్ కృష్ణ 346 సినిమా పేర్లు’ చెప్పి అబ్బుర పరుస్తోంది ఓ చిన్నారి. తన అద్భుతమైన జ్ఞాపకశక్తితో ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది. విజయవాడకి చెందిన మున్నంగి హాసిని వయస్సు 10 ఏళ్లు. ఐకాన్ పబ్లిక్ స్కూల్‌లో ఐదో తరగతి చదువుతోంది. సూపర్ స్టార్ కృష్ణ నటించిన 346 చిత్రాల పేర్లను కేవలం 5 నిమిషాల వ్యవధిలో వరుస క్రమంలో చెప్పింది హాసిని. కృష్ణ మొదటి చిత్రం ‘తేనె మనుసులు’ నుంచి చివరి చిత్రం’ శ్రీశ్రీ’ వరకు నాన్ స్టాప్‌గా పేర్లు చెప్పి తన ప్రతిభను చాటుకుంది చిన్నారి హాసిని.
కాగా ప్రిన్స్ మహేష్ బాబు వెయ్యి మంది చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించి కొత్త జీవితాన్ని ఇచ్చి వారి ముఖాల్లో చిరు నవ్వులు పూయించారు. ప్రిన్స్ బర్త్ డే తరపున.. చిన్నారుల తరుపున ఏదైనా కానుక ఇవ్వాలనుకున్న ఫ్యాన్స్.. చిన్నారి హాసినీ చేత మహేష్ తండ్రి కృష్ణ సినిమాల గురించి కంఠస్తం చేయించారు. కాగా ఐదు నిమిషాల్లో సూపర్ స్టార్ కృష్ణ సినిమాల గురించి చెప్పిన చిన్నారి హాసినిని పలువురు అభినందిస్తున్నారు.
సరిలేరు నీకెవ్వరు చిత్ర విజయోత్సం సందర్భంగా ఓ టీవీకి వచ్చిన ఇంటర్వ్యూలో తన తండ్రి 350 చిత్రాల్లో నటించారని, ఆ చిత్రాల పేరు వరుసగా ఎవరైనా చెప్పగలరా? అనే మహేష్ మాటలతో స్ఫూర్తి పొందిన హాసిని వారం రోజుల వ్యవధిలో సినిమా పేర్లను కంఠస్తం చేసింది.
Read More: