టిక్‌టాక్ కొనుగోలుకు.. రేసులో ట్విట్టర్.. కానీ.!

చైనాకు చెందిన టిక్‌టాక్‌ను కొనుగోలు చేసేందుకు ట్విట్టర్ ఆసక్తి చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికాలో టిక్‌టాక్‌ను 45 రోజుల్లోగా బ్యాన్ చేస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో..

టిక్‌టాక్ కొనుగోలుకు.. రేసులో ట్విట్టర్.. కానీ.!
Follow us

|

Updated on: Aug 09, 2020 | 5:25 PM

Twitter Reportedly Wants to Buy TikTok: చైనాకు చెందిన టిక్‌టాక్‌ను కొనుగోలు చేసేందుకు ట్విట్టర్ ఆసక్తి చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికాలో టిక్‌టాక్‌ను 45 రోజుల్లోగా బ్యాన్ చేస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో.. సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అమెరికా ఆపరేషన్స్ మాత్రమే కాకుండా మొత్తంగా టిక్‌టాక్‌ను సొంతం చేసుకునేందుకు చర్చలు జరుపుతోంది. సెప్టెంబర్ 15వ తేదీకి తుది నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది.

ఇక ఇప్పుడు తాజాగా రేసులోకి ట్విట్టర్ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. టిక్‌టాక్‌ మాతృ సంస్థ బైట్ డాన్స్‌తో ఇటీవల ట్విట్టర్ చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారంపై అటు ట్విట్టర్, ఇటు బైట్ డాన్స్ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అటు టిక్‌టాక్ కొనుగోలుకు ట్విట్టర్.. సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో పోటీ పడే సామర్ధ్యం, ఇన్వెస్ట్ మెంట్ క్యాపిటల్ కూడా లేదని తెలుస్తోంది. కాగా, చైనాకు సంబంధించిన టిక్‌టాక్ యాప్‌ను ఇప్పటికే భారత్‌లో బ్యాన్ చేశారు. అటు అమెరికాలో కూడా నిషేధించేందుకు ఆ దేశాధ్యక్షుడు 45 రోజుల గడువు ఇచ్చారు. ఆలోగా ఏదైనా అమెరికన్ కంపెనీ టిక్‌టాక్‌ను కొనుగోలు చేయడమే కాకుండా అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్‌కు పెద్ద మొత్తంలో నిధులు ఇవ్వాలని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.