మిజోరంలో కొత్తగా 43 కరోనా పాజిటివ్ కేసులు..!
దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో మహమ్మారి వ్యాప్తి చెందకుండా మిజోరం రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ రాష్ట్రంలో
దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో మహమ్మారి వ్యాప్తి చెందకుండా మిజోరం రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో 17 మంది బీఎస్ఎఫ్ సిబ్బందితోపాటు కొత్తగా 43 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో ఇప్పటి వరకు 608 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఐజ్వాల్ జిల్లాలో కొత్తగా 24 కేసులు, కోలాసిబ్ లో 18 కేసులు నమోదయ్యాయి.
Read More:
30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు.. తొలి దశలో 15 లక్షల ఇళ్లు..!
ఆదుకున్న రబీ దిగుబడి.. రాష్ట్రానికి తప్పిన ఆహార ఇబ్బందులు..!