ఆదుకున్న రబీ దిగుబడి.. రాష్ట్రానికి తప్పిన ఆహార ఇబ్బందులు..!

కోవిద్-19 సంక్షోభంలో కూడా ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో రబీలో ఆశించిన మేరకు ధాన్యం దిగుబడి రావడంతో ప్రజా పంపిణీ వ్యవస్థ సవ్యంగా సాగింది. రబీలో రికార్డు స్థాయిలో

ఆదుకున్న రబీ దిగుబడి.. రాష్ట్రానికి తప్పిన ఆహార ఇబ్బందులు..!
Follow us

| Edited By:

Updated on: Aug 09, 2020 | 10:01 AM

కోవిద్-19 సంక్షోభంలో కూడా ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో రబీలో ఆశించిన మేరకు ధాన్యం దిగుబడి రావడంతో ప్రజా పంపిణీ వ్యవస్థ సవ్యంగా సాగింది. రబీలో రికార్డు స్థాయిలో 31.48 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం రైతుల నుంచి సేకరించింది. దీంతో రాష్ట్రానికి ఆహార ఇబ్బందులు తప్పాయి. కరోనా కారణంగా పనులు లేక ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం నెలకు రెండు విడతలుగా బియ్యంతో పాటు కందిపప్పు లేదా శనగలు ఉచితంగా పంపిణీ చేస్తున్న విషయం విదితమే.

ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 1,49,20,706 కార్డులు ఉన్నాయి. వీటిలో జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోనివి 89 లక్షలకు పైగా, ఆ చట్టం పరిధిలోకి రానివి 60 లక్షల వరకు ఉన్నాయి. ఆహార భద్రతా చట్టం పరిధిలోకి వచ్చే కార్డుదారులకే కేంద్రం బియ్యం ఇస్తోంది. మిగిలిన కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వమే పంపిణీ చేస్తోంది. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు ఆహార భద్రతా చట్టం పరిధిలోకి రాని కార్డుదారులకు పంపిణీతో రాష్ట్రంపై రూ.800 కోట్లు అదనపు భారం పడింది. జూలై నుంచి నవంబర్‌ వరకు ఉచితంగా బియ్యం ఇస్తామని కేంద్రం ప్రకటనతో రాష్ట్రంపై మరో రూ.1,663 కోట్ల అదనపు భారం పడనుంది.

దీంతో 7 లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా ఉండాల్సిన బఫర్‌ స్టాక్ కూడా వాడేశారు. కనీసం 15.05 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని అదనంగా కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి కేంద్రం స్పందించనేలేదు. నెలకు రెండు సార్లు పంపిణీతో బఫర్‌ స్టాకునూ వాడుకోవాల్సి వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అదనంగా కేటాయించాలని కేంద్రానికి లేఖ రాశాం. రైతుల నుంచి రబీలో కొనుగోలు చేసిన ధాన్యమే ప్రస్తుతం ఆదుకుంటోందని పౌరసరఫరాల శాఖ తెలిపింది.

Also Read: 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు.. తొలి దశలో 15 లక్షల ఇళ్లు..!