చాహల్‌కి రోహిత్ కంగ్రాట్స్‌.. ట్వీట్ చూస్తే నవ్వు ఆగదు‌

చాహల్‌కి రోహిత్ కంగ్రాట్స్‌.. ట్వీట్ చూస్తే నవ్వు ఆగదు‌

టీమిండియా క్రికెటర్ యుజువేంద్ర చాహల్‌ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. ప్రముఖ యూట్యూబర్‌, డాక్టర్‌, కొరియోగ్రాఫర్‌ ధనుశ్రీ వర్మను చాహల్ మనువాడబోతున్నారు.

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 09, 2020 | 5:38 PM

Rohit Sharma Meme on Chahal: టీమిండియా క్రికెటర్ యుజువేంద్ర చాహల్‌ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. ప్రముఖ యూట్యూబర్‌, డాక్టర్‌, కొరియోగ్రాఫర్‌ ధనుశ్రీ వర్మను చాహల్ మనువాడబోతున్నారు. దీనికి సంబంధించిన రోకా వేడుక ఇటీవల జరగ్గా.. ఆ ఫొటోలను చాహల్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఇక చాహల్‌ పోస్ట్‌పై స్పందించిన పలువురు ప్రముఖులు,అభిమానులు అతడికి అభినందనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తన సోషల్ మీడియాలో చాహల్‌కి విషెస్‌ చెప్పారు. ఈ సందర్భంగా ఐపీఎల్‌ 2050లో యువ క్రికెటర్‌తో చాహల్‌ అంటూ ఓ మీమ్‌ని షేర్ చేశారు. ఆ ఫొటో నెటిజన్ల చేత నవ్వులు పూయిస్తుండగా.. చాహల్ ఇంకా స్పందించలేదు. అయితే వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండగా.. గతంలోనూ వీరు ఒకరిపై మరొకరు ఫన్నీ జోక్‌లు వేసుకున్న విషయం తెలిసిందే.

Read This Story Also: షాకింగ్‌ న్యూస్‌.. కరోనాతో కోలుకున్నా ఆ ముప్పు తప్పదట

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu