‘బయో సెక్యూర్ బబుల్’లో ఐపీఎల్.. సీఎస్‌కే కీలక నిర్ణయం..

'బయో సెక్యూర్ బబుల్'లో ఐపీఎల్.. సీఎస్‌కే కీలక నిర్ణయం..

గత ఐపీఎల్ సీజన్లతో పోలిస్తే.. ఈ ఏడాది జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ కత్తి మీద సామనే చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో బీసీసీఐ..

Ravi Kiran

|

Aug 09, 2020 | 1:26 PM

CSK Players To Travel UAE On August 22: గత ఐపీఎల్ సీజన్లతో పోలిస్తే.. ఈ ఏడాది జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ కత్తి మీద సామనే చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో బీసీసీఐ.. ఈ ఐపీఎల్‌ను యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పూర్తిగా ‘బయో సెక్యూర్ బబుల్’లో ఆటగాళ్లు టోర్నీ పూర్తయ్యేవరకు ఉండాల్సిన ఉంటుంది. ప్రతీ ఐదు రోజులకు ఒకసారి ఆటగాళ్లకు హెల్త్ చెకప్స్ నిర్వహిస్తారు. ఇక క్రికెటర్లు తమ కుటుంబసభ్యులను తీసుకురావాలా.? వద్దా.? అనే అంశాన్ని బీసీసీఐ ఆయా ఫ్రాంచైజీలకే వదిలేసింది. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

క్రికెటర్లతో పాటు వారి కుటుంబసభ్యులను కూడా అనుమతించడం రిస్క్‌తో కూడుకున్న విషయమని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ భావిస్తోందట. ఎందుకంటే సిఎస్కే జట్టులో ఎక్కువశాతం మంది ఆటగాళ్లు పెళ్ళైన వారే ఉండటంతో.. వారిని బయో సెక్యూర్ బబుల్‌లో ఉంచడం కష్టం కాబట్టి.. వారిని అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu