Heera Gold Case: భారీగా ఆస్తులు స్వాధీనం
హీరా గోల్డ్ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు స్పీడ్ చేసింది. నౌహీరా షేక్‌కు సంబంధించిన ఆస్తులను ఒక్కొక్కటిగా అటాచ్ చేసుకుంటూ వెళ్తుంది.
Heera Gold case : హీరా గోల్డ్ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు స్పీడ్ చేసింది. నౌహీరా షేక్‌కు సంబంధించిన ఆస్తులను ఒక్కొక్కటిగా అటాచ్ చేసుకుంటూ వెళ్తుంది. తాజాగా ప్రధాన నిందితురాలు నౌహీరా షేక్‌కు చెందిన మరికొన్ని భూములను ఈడీ స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్ షేక్ పేట్ ఎస్ఏ కాలనీలోని రూ.71 కోట్ల విలువైన 81 ప్లాట్లను రెవిన్యూ పోలీసు అధికారుల సాయంతో జప్తు చేసింది. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు రూ. 300 కోట్ల ఆస్తులను ఈడీ ఆధీనంలోకి తీసుకుంది. ఇంకా రూ.600 కోట్ల పైచిలుకు ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేయనున్నట్లు సమాచారం. నౌహీరా షేక్‌పై దేశ వ్యాప్తంగా నమోదైన 60 కేసుల ఆధారంగా రూ.5,600 కోట్ల కుంభకోణంపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.
Also Read : నల్గొండలో ఘరానా దొంగలు.. ఏకంగా ఎస్ఐ ఇంట్లోనే చోరీ