స్వర్ణ ప్యాలెస్ ఘటనః మృతుల వివరాలు ఇవే
ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ స్వర్ణ ప్యాలస్‌లో తెల్లవారు జామున భారీ అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 10 మంది దుర్మరణం చెందారు. అయితే ఈ ప్యాలెస్‌ను ఓ ప్రైవేట్ ఆస్పత్రి అద్దెకు తీసుకుంది. దీనిని కరోనా రోగుల కేర్ సెంటర్‌గా..
ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ స్వర్ణ ప్యాలస్‌లో తెల్లవారు జామున భారీ అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 10 మంది దుర్మరణం చెందారు. అయితే ఈ ప్యాలెస్‌ను ఓ ప్రైవేట్ ఆస్పత్రి అద్దెకు తీసుకుంది. దీనిని కరోనా రోగుల కేర్ సెంటర్‌గా ఉపయోగిస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే.. సంఘటనాస్థలికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి, మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాద ఘటనపై పీఎం నరేంద్ర మోదీ కూడా సీఎం జగన్‌కి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంకా పులువురు రాజకీయ నాయకులు కూడా ఈ ప్రమాద ఘటనపై సంతాపం ప్రకటించారు. కాగా స్వర్ణా ప్యాలెస్‌లో అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన బాధితుల వివరాలను రిలీజ్ చేసింది ఏపీ ప్రభుత్వం.
మృతి చెందిన బాధితుల వివరాలివేః
1. డోక్కు శివ బ్రహ్మయ్య, మచిలీపట్నం (58) 2. పూర్ణ చంద్ర రావు, మొవ్వ 3. సుంకర బాబు రావు, సింగ్ నగర్ (రిటైర్డ్ ఎస్సై) 4. మజ్జి గోపి, మచిలీపట్నం 5. సువర్ణ లత పొన్నూరు, నిడుబ్రోలు 6. వెంకట లక్ష్మి సువర్చలా దేవి, (జయ లక్ష్మి) కందుకూరు 7. పవన్ కుమార్, కందుకూరు 8. అబ్రహం, చర్చి ఫాథర్, జగ్గయ్య పేట 9. రాజకుమారి అబ్రహం, జగ్గయ్యపేట 10. రమేష్, విజయవాడ
Read More:
ప్రపంచ వ్యాప్తంగా ఉధృతంగా పెరుగుతోన్న కోవిడ్ కేసులు
ప్రిన్స్ బర్త్‌డే స్పెషల్ః ‘సర్కారు వారి పాట’ మోషన్ పోస్టర్ అదిరింది