Raai Laxmi-Dhoni: ‘ధోనితో అందుకే బ్రేకప్’.. ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేసిన రాయ్ లక్ష్మీ
మిస్టర్ కూల్, మహీభాయ్, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.. యంగ్ క్రికెటర్స్‌కి అతడు చాలా విషయాల్లో ఆదర్శంగా నిలుస్తాడు. అయితే తాజాగా మహీతో బ్రేకప్ గురించి నటి రాయ్ లక్ష్మీ మాట్లాడింది.
మిస్టర్ కూల్, మహీభాయ్, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.. యంగ్ క్రికెటర్స్‌కి అతడు చాలా విషయాల్లో ఆదర్శంగా నిలుస్తాడు. ఇప్పటికే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మహీ.. జట్టుకు ఏదో విధంగా తన సేవలను అందిస్తున్నాడు. టీమిండియా జట్టుకు మెంటర్‌గా ఉంటూ జట్టుకు ఓ టార్చ్‌బేరర్‌గా నిలుస్తున్నాడు. అయితే ధోని క్రికెట్ కెరీర్ తొలినాళ్లల్లో కొన్ని లవ్ ట్రాక్‌లు నడిచిన్నట్లు వార్తలు కూడా వచ్చాయి. తాజాగా అతడితో లవ్ ట్రాక్ నడిపిన విషయంపై స్పందించింది నటి రాయ్ లక్ష్మీ. తన జీవితంలో ఎంఎస్ ధోనితో ప్రేమ వ్యవహారం వైఫల్యం గురించి తాజా ఇంటర్యూలో మాట్లాడారు. ఎందుకు విడిపోవాల్సి వచ్చిందన్న విషయంపై ఆమె క్లారిటీ ఇచ్చింది.
తమిళ, తెలుగు ఇండస్ట్రీస్‌లో మంచి హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది రాయ్ లక్ష్మీ. 2008 ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సారథిగా ధోని ఉన్న సమయంలోనే డేటింగ్‌లో ఉన్నట్లు ఆమె పేర్కొంది. ఐపీఎల్ మ్యాచుల అనంతరం జరిగే పార్టీలకు ధోనితో కలిసి రాయ్ లక్ష్మీ హాజరైన్నట్లు అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. అయితే 2008 నుంచి 2009 వరకు వారి డేటింగ్ కొనసాగినట్లు చెబుతారు. రాయ్ లక్ష్మీతో ఎంఎస్ ధోని డేటింగ్ వ్యవహారం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. వారి రిలేషన్ పెళ్లి వరకు వెళ్తుందన్న టాక్ కూడా నడిచింది. అయితే ఊహించని విధంగా ధోని, రాయ్ లక్ష్మీ ఏడాదిలోపే బ్రేకప్ చెప్పుకున్నారు,
రాయ్ లక్ష్మీతో బ్రేకప్ తర్వాత మహేంద్ర సింగ్ ధోని సాక్షిని పెళ్లాడాడు. అయితే రాయ్ లక్ష్మీ మాత్రం ఇంకా మ్యారేజ్ చేసుకోలేదు. అయితే ధోనితో బ్రేకప్ గురించి రాయ్ లక్ష్మీ మాట్లాడుతూ.. ఆయనతో రిలేషన్ తన జీవితంపై ఓ మచ్చగా మారిందని పేర్కొంది. ధోనితో బ్రేకప్ జరిగి దాదాపు 12 ఏళ్ల గడిచిపోయినా… ఆ విషయం తనను వెంటాడుతూనే ఉందని పేర్కొంది. ధోని గురించి మీడియాలో ఏదైనా విషయంపై చర్చ జరిగినప్పుడు.. తన గురించి ప్రస్తావిస్తారని ఆవేదన వ్యక్తం చేసింది. నాకు పెళ్లై, పిల్లలు కలిగి వారు పెద్దైన తర్వాత కూడా ధోనితో అఫైర్ గురించి మాట్లాడుతూనే ఉంటారేమో అని వాపోయింది.
సంవత్సరం పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్న తర్వాత ధోని, తాను సామరస్యంగా విడిపోవాలని అనుకున్నట్లు రాయ్ లక్ష్మీ స్పష్టం చేసింది. ఎలాంటి గొడవలు లేకుండా బ్రేకప్ చెప్పుకొన్నట్లు వెల్లడించింది. బ్రేకప్ జరిగినా తమకు ఒకరిపై మరొకరికి రెస్సెక్ట్ ఉందని పేర్కొంది. ధోని తర్వాత తన జీవితంలో చాలా బ్రేకప్స్ జరిగాయని… అయినా తానెప్పుడూ బాధపడలేదని వెల్లడించింది. హ్యాపీగానే జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నానని.. ప్రస్తుతం కెరీర్‌పైనే దృష్టిపెట్టాను అని రాయ్ లక్ష్మీ స్పష్టం చేసింది.
Also Read: ఈ ఫోటోలోని టీనేజర్ ఇప్పుడు డిజిటల్ ప్రపంచాన్ని శాసిస్తున్నాడు.. ఎవరో గుర్తుపట్టారా..?