Puneeth Rajkumar: గతంలో తెలుగు పవర్ స్టార్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కన్నడ పవర్ స్టార్..

మిడిలేజ్‌లోనే మనల్ని విడిచి వెళ్లిన పునీత్ రాజ్‌కుమార్‌. టాలీవుడ్‌ని కూడా శోకంలో ముంచేశారు. మాతృగడ్డ కన్నడే అయినా.. తెలుగు ఇండస్ట్రీతో, తెలుగు నటీనటులతో పునీత్‌కి అసోసియేషన్ ఎక్కువ.

Puneeth Rajkumar: గతంలో తెలుగు పవర్ స్టార్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కన్నడ పవర్ స్టార్..
Punith RajKumar
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 29, 2021 | 4:53 PM

మిడిలేజ్‌లోనే మనల్ని విడిచి వెళ్లిన పునీత్ రాజ్‌కుమార్‌. టాలీవుడ్‌ని కూడా శోకంలో ముంచేశారు. మాతృగడ్డ కన్నడే అయినా.. తెలుగు ఇండస్ట్రీతో, తెలుగు నటీనటులతో పునీత్‌కి అసోసియేషన్ ఎక్కువ. చివరివరకూ తెలుగు పరిశ్రమతో అనుబంధాన్ని కొనసాగించారు పునీత్. మాస్టర్ లోహిత్‌గా బాలనటుడిగా డజను సినిమాలు చేశారు. అప్పు అనే సినిమాలో హీరోగా పరిచయమయ్యారు పునీత్. ఇది టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన మూవీ. రవితేజ ఇడియట్ మూవీకి ఇది కన్నడ వెర్షన్.

పూరి రాసిన మరో కథను వీర కన్నడిగ పేరుతో తీశారు. పునీత్‌ హీరోగా ఆ సినిమాను మెహర్ రమేష్‌ డైరెక్ట్ చేశారు. క్రియేటివ్ కమర్షియల్స్బేనర్‌పై కేస్ రామారావు నిర్మించిన సినిమా ఇది. నా వీర కన్నడిగ ఇక లేరా అంటూ షాక్ అవుతూ ట్వీట్ చేశారు మెహర్ రమేష్. మరో తెలుగు డైరెక్టర్… గుడుంబా శంకర్ ఫేమ్‌ వీరశంకర్ కూడా పునీత్‌ హీరోయిజాన్ని ఎలివేట్ చేశారు. 2005లో రిలీజైన నమ్మబసవ పునీత్‌ని మాస్ హీరోగా ప్రజెంట్ చేసింది.

యంగ్ టైగర్ ఎన్టీయార్‌ని అమితంగా అభిమానిస్తారు పునీత్. తన సినిమా చక్రవ్యూహ కోసం ఎన్టీయార్‌ని అడిగిమరీ పాట పాడించుకున్నారు. అప్పట్లో వీళ్లిద్దరి బంధంపై టాలీవుడ్-శాండల్‌వుడ్ గొప్పగా చెప్పుకున్నాయి. కన్నడ పవర్‌స్టార్‌ అనే ట్యాగ్‌లైన్ గురించి మాట్లాడుతూ… పవన్‌కల్యాణ్‌ మీద గౌరవాన్ని చాటుకున్నారు పునీత్. పవర్‌స్టార్ అనే క్రెడిట్… తనక్కాదు.. పవన్‌కే బాగా సూటవుతుందని… ఆయన తర్వాతే ఎవరైనా అని తన మనసులోని ప్రేమను వ్యక్తపరిచారు.

రీసెంట్ ఇయర్స్‌లో తెలుగు మేకర్స్‌కి, తెలుగు హీరోయిజానికే కాదు.. తెలుగు ఆడియన్స్‌కి కూడా బాగా దగ్గరయ్యారు పునీత్. యువరత్న సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఇప్పుడు ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్‌ వైపు చూస్తున్నారు పునీత్. హొంబలే ఫిలిమ్స్‌ బేనర్‌పై తీస్తున్న ద్విత్వ మూవీ…. తెలుగు వెర్షన్‌ కూడా అనౌన్స్ అయింది. కానీ… తెలుగు ప్రేక్షకుడికి అందినట్టే అంది దూరమయ్యారు పునీత్‌.

Also Read: Puneeth Rajkumar: కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ చివరి ట్వీట్ ఇదే…

సూపర్‌ స్టార్ రజినీకాంత్‌ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్‌ బులెటిన్ విడుదల..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ