AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Raja Saab: అఖండ 2 బాటలోనే ది రాజా సాబ్! ప్రభాస్ సినిమా రిలీజ్‌ గురించి అసలు విషయం చెప్పిన నిర్మాత

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను హిట్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘అఖండ 2 తాండవం’. డిసెంబర్ 05న విడుదల కావాల్సిన ఈ మూవీ అనూహ్యంగా వాయిదా పడింది. ఇప్పటివరకు ఈ సినిమా రిలీజ్ పై క్లారిటీ రాలేదు. అయితే ఇప్పుడు అఖండ 2 బాటలోనే ప్రభాస్ ది రాజాసాబ్ వాయిదా పడనుందా?

The Raja Saab: అఖండ 2 బాటలోనే ది రాజా సాబ్! ప్రభాస్ సినిమా రిలీజ్‌ గురించి అసలు విషయం చెప్పిన నిర్మాత
Akhanda 2, The Raja Saab
Basha Shek
| Edited By: |

Updated on: Dec 08, 2025 | 6:59 PM

Share

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ 2 తాండవం’ సినిమా అనూహ్యంగా వాయిదా పడింది. బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉండగా చివరి క్షణంలో పోస్ట్ పోన్ అయ్యింది. దీంతో బాలయ్య అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. కాగా అఖండ 2 బాటలోనే ప్రభాస్ ది రాజాసాబ్ సినిమా కూడా వాయిదా పడనుందంటూ ప్రచారం జరుగుతోంది. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ మూవీ పొంగల్ కు ప్రేక్షకుల ముందుకు రావడం కష్టమని రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై ది రాజాసాబ్ నిర్మాత విశ్వ ప్రసాద్‌ స్పందించాడు. అఖండ 2 చివరి క్షణంలో వాయిదా పడడం పై ఆవేదన వ్యక్తం చేసిన ఆయనది రాజాసాబ్‌’ రిలీజ్‌పై జరుగుతన్న ప్రచారంపై కూడా క్లారిటీ ఇచ్చారు.

విడుదలకు సిద్ధమైన సినిమాలు కొన్ని గంటల ముందు వాయిదా పడుతుండటం దురదృష్టకరం. ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండించాలి. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు.. ఇలా ఎంతోమందిపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుంది. థర్డ్‌ పార్టీలు చివరి క్షణంలో సినిమా విడుదలకు అంతరాయం కలిగించకుండా చట్టపరమైన మార్గదర్శకాలు రూపొందించడం చాలా ముఖ్యం. ఇప్పుడు మా సినిమా ‘ది రాజాసాబ్‌’ రిలీజ్‌పై కూడా రూమర్స్‌ వచ్చాయి. ఈ సినిమా కోసం సేకరించిన పెట్టుబడులను మేం ఇప్పటికే క్లియర్‌ చేశాం. వడ్డీని కూడా త్వరలోనే చెల్లిస్తాం. ‘అఖండ 2’తోపాటు డిసెంబరులో విడుదల కానున్న చిత్రాలు, 2026 సంక్రాంతికి రానున్న ‘ది రాజాసాబ్‌’, ‘మన శంకర వరప్రసాద్‌ గారు’, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, ‘అనగనగా ఒక రాజు’, ‘నారీ నారీ నడుమ మురారి’, ‘జన నాయగన్‌’, ‘పరాశక్తి’ తదితర సినిమాల కోసం ఎదురుచూస్తున్నా. అన్నీ చిత్రాలు మంచి విజయాలు అందుకోవాలని ఆశిస్తున్నాఅని విశ్వ ప్రసాద్ ఆకాంక్షించారు.

ఇవి కూడా చదవండి

ది రాజా సాబ్ నిర్మాత ట్వీట్..

ది రాజాసాబ్ సినిమాలో ప్రభాస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?