The Girlfriend Movie: రష్మిక సినిమా చూసి చున్నీ తీసేసిన అమ్మాయి.. వైరల్ వీడియోపై ఎస్కేఎన్ షాకింగ్ కామెంట్స్
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించిన లేటెస్ట్ సినిమా ది గర్ల్ ఫ్రెండ్. ఇటీవల థియేటర్లలో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లుతోంది. టాక్సిక్ బాయ్ ఫ్రెండ్ ఉన్న అమ్మాయి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొందన్నది ఈ సినిమాలో చూపించారు.

రష్మిక మందన్నా నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లుతోంది. రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి మరో ప్రధాన పాత్రలో నటించాడు. టాక్సిక్ బాయ్ ఫ్రెండ్స్ ఉన్న అమ్మాయిలు పర్సనల్ గా, ప్రొఫెషనల్ గా ఎలా ఇబ్బంది పడుతున్నారన్నది ఈ సినిమాలో చూపించారు. ముఖ్యంగా అమ్మాయిలకు ఈ సినిమా తెగ నచ్చేసింది. ఈ నేపథ్యంలో ది గర్ల్ ఫ్రెండ్ సినిమా చూసిన కొంత మంది అమ్మాయిలు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. సినిమాల్లో లాగే తాము రియల్ లైఫ్ లో ఇలాంటి చేదు అనుభవాలను ఎదుర్కొన్నామంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. ఇదిలా ఉంటే డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ తాజాగా ఓ థియేటర్ కు వెళ్లాడు. అక్కడ ది గర్ల్ ఫ్రెండ్ సినిమా చూసిన అమ్మాయి నేరుగా రాహుల్ దగ్గరకు వచ్చింది. సినిమా చాలా బాగుందని డైరెక్టర్ కు కాంప్లిమెంట్స్ ఇచ్చింది. అయితే సినిమా చివర్లలో రష్మిక చున్నీ తీసేసినట్లు ఆ అమ్మాయి కూడా చున్నీ తీసేసింది. తాను కూడా లైఫ్ ను ఇలాగే ఫేస్ చేస్తానని రాహుల్ తో చెప్పుకొచ్చింది. దీంతో డైరెక్టర్ రాహుల్ ఆ అమ్మాయిని మెచ్చుకుని ఒక హగ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అమ్మాయి ప్రవర్తించిన తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అమ్మాయిని సపోర్టు చేస్తుంటే మరికొందరు ఆమెను ట్రోల్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలు చున్నీ కాంట్రవర్సీపై నిర్మాత ఎస్కేఎన్ స్పందించాడు. ది గర్ల్ ఫ్రెండ్ సక్సెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. ‘ బంగారు తల్లులు రాహుల్ రవీంద్రన్ ఈ సినిమా తీసింది మీలో భయాన్ని పోగొట్టాలని. అంతేకానీ చున్నీలు ఎగరేయాలని కాదమ్మా. పొద్దున్నుంచి ధీరజ్ గారి ఆఫీస్ ముందు అందరూ బట్టల షాప్ వాళ్లు ఉన్నారు. మా చున్నీల సేల్స్ పడిపోతాయి అని. అందుకే మీ అందరికి ఒక మాట. చున్నీ వేసుకొని హ్యాపీగా సినిమా చూడండి. మీకు కంఫర్ట్ గా ఉంటె ఏ డ్రెస్ అయినా వేసుకోండి. భయాన్ని వదిలేయండి అని మాత్రమే ఈ సినిమా ద్వారా మెసేజ్ ఇచ్చాం. అంతేకాని వేరే ఏది వదిలేయమని కాదు’ అని అన్నారు. దీంతో ఆ అమ్మాయి వీడియో మళ్లీ ఇప్పుడు నెట్టింట వైరలవుతోంది. అలాగే ఎస్కేఎన్ కామెంట్స్ కూడా హాట్ టాపిక్ గా మారాయి.
వైరల్ వీడియో ఇదే..
View this post on Instagram
నిర్మాత ఎస్కేఎన్ కామెంట్స్..
View this post on Instagram








