అవన్నీ ఊహాగానాలే నమ్మొద్దు.. మహేష్ – రాజమౌళి సినిమాపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. సర్కారువారి పాట అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో..

అవన్నీ ఊహాగానాలే నమ్మొద్దు.. మహేష్ - రాజమౌళి సినిమాపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత..
Follow us
Rajeev Rayala

|

Updated on: May 31, 2021 | 8:08 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. సర్కారువారి పాట అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ కు జోడీగా కీర్తి  సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనుందని తెలుస్తుంది. ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. ఈ సినిమా తరవాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో మహేష్ సినిమా చేస్తున్నాడు. దాదాపు 11 ఏళ్లతర్వాత మహేష్ త్రివిక్రమ్ కలిసి సినిమా చేస్తున్నారు. ఇదిలా ఉంటే మహేష్ తో దర్శకధీరుడు రాజమౌళి సినిమా చేస్తానని ప్రకటించిన విషయం తెల్సిందే. అయితే ఆ తర్వాత ఇంతవరకు ఆ సినిమా గురించి ఎలాంటి వార్త బయటకు రాలేదు. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. గతేడాది లాక్ డౌన్ టైంలో ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత సినిమా మహేష్ తోనే ఉంటుందని జక్కన్న క్లారిటీ ఇచ్చాడు. ఈ కాంబోలో సినిమా ప్రకటన రాగానే అభిమానులందరూ ఖుషీ అయ్యారు.

రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. మహేష్ కోసం ఓ జంగిల్ బేస్డ్ అడ్వెంచర్ స్టోరీ లైన్ అనుకుంటున్నారని.. ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారని ఆమధ్య వార్తలు వచ్చాయి. తాజాగా నిర్మాత కేఎల్ నారాయణ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అవన్నీ ఊహాగానాలే అని కొట్టిపారేశారు. ”మహేష్ బాబు – రాజమౌళి కాంబోలో రాబోతున్న సినిమాకి బయట మీకు వినిపిస్తున్న వార్తలకి ఎటువంటి సంబంధం లేదు. అవన్నీ ఊహాగానాలు. నిజంగా చెప్పాలంటే సబ్జెక్ట్ ఏంటి.. ఎక్కడ చేస్తున్నాం అనేది నాకే తెలియదు. ఇంక మిగతా వాళ్ళకి ఎలా తెలుస్తుంది” అని నిర్మాత కేఎల్ నారాయణ   అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Satya Dev: విచిత్ర‌మైన ప‌రిస్థితుల్లో యువ న‌టుడు స‌త్య దేవ్.. డిజిట‌ల్ వైపు అత‌డి రాబోయే సినిమాలు

సోను సూద్ కాల్స్ ఎత్తలేక పనివాడు పరేషాన్..ఈ రాత్రి కి పగలకి తేడా లేకుండా పోయింది అంటూ ఆవేదన :sonu sood video.