AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prithviraj Sukumaran : లూసిఫర్ 2 తెలుగులోనే చూడండి.. ఆ విషయంలో మీకు ఛాలెంజ్.. హీరో పృథ్వీరాజ్ సుకుమారన్..

సలార్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు మలయాళీ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. ఆ తర్వాత ఆడు జీవితం సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చాడు. ఇక ఇప్పుడు లూసిఫర్ 2 అంటూ మరోసారి బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు ఆయనతో కలిసి మోహన్ లాల్ సైతం తెలుగు ప్రేక్షకులను అలరించనున్నారు.

Prithviraj Sukumaran : లూసిఫర్ 2 తెలుగులోనే చూడండి.. ఆ విషయంలో మీకు ఛాలెంజ్.. హీరో పృథ్వీరాజ్ సుకుమారన్..
Prithviraj, Dilraj, Mohanla
Rajitha Chanti
|

Updated on: Mar 22, 2025 | 6:28 PM

Share

మలయాళ సూపర్‌స్టార్‌, కంప్లీట్ యాక్ట‌ర్ మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబోలో తెర‌కెక్కిన భారీ చిత్రం ‘L2E: ఎంపురాన్’. చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మించారు. ముర‌ళీ గోపి క‌థ‌ను అందించారు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మార్చి 27న మలయాళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలో శనివారం నాడు చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా సూపర్‌స్టార్‌, కంప్లీట్ యాక్ట‌ర్ మోహన్‌లాల్ మాట్లాడుతూ .. తెలుగు ప్రేక్షకులు చూపించే ప్రేమ ఇంకెక్కడా దొరకదని అన్నారు.

‘మా సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న దిల్ రాజు గారికి థాంక్స్. 47 ఏళ్లుగా ఈ సినీ ఇండస్ట్రీలో నా ప్రయాణంలో తెలుగు చిత్ర సీమతో ఎంతో అనుబంధం ఉంది. అక్కినేని నాగేశ్వరరావు గారితో నటించే అదృష్టం నాకు కలిగింది. తెలుగు ప్రేక్షకులు చూపించే ప్రేమ ఇంకెక్కడా దొరకదు. ఇండియాలోనే టాలీవుడ్ ది బెస్ట్ ఇండస్ట్రీగా ఉంది. కేరళలో మేం అన్ని భాషల చిత్రాలను చూస్తాం. ఇప్పుడు మా సినిమాల్ని కూడా అన్ని భాషల వాళ్లు చూస్తున్నారు. ఇప్పుడు మేం పాన్ ఇండియా వైడ్‌గా చిత్రాలను చేస్తున్నాం. మేం ముందుగా లూసిఫర్‌ను మూడు పార్టులుగా తీయాలని అనుకున్నాం. ఎంపురాన్ బ్లాక్ బస్టర్ అయితే.. మూడో పార్ట్‌తో మళ్లీ వస్తాం. రెండేళ్లుగా ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డాం. అందరినీ అలరించేలా మా సినిమా ఉంటుంది. మార్చి 27న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ .. ‘మా కోసం వచ్చిన దిల్ రాజు గారికి థాంక్స్. తెలుగులో మా సినిమాను రిలీజ్ చేస్తున్న ఆయనకు చాలా థాంక్స్. ఇలాంటి సినిమాను మేం ఎప్పుడూ ట్రై చేయలేదు. ఒరిజినల్ వర్షెన్‌లానే తెలుగు వర్షెన్ ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కోసం చాలా కష్టపడ్డాం. చాలా అథాంటిక్‌గా ఉండాలని ప్రయత్నించాం. తెలుగు ప్రేక్షకులు తెలుగు వర్షెన్‌లో చూస్తే.. ఒరిజినల్ సినిమానే అనుకుంటారు. ఎక్కడా డబ్బింగ్ సినిమా అన్నట్టుగా కనిపించదు. లూసిఫర్ సినిమాను అన్ని భాషల్లో రిలీజ్ చేయలేదు. కానీ అన్ని భాషల్లోకి ఆ చిత్రం రీచ్ అయింది. అందుకే ఇప్పుడు ఈ రెండో పార్ట్‌ను ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. మోహన్‌లాల్ గారు ఇచ్చిన సపోర్ట్, ఆయనకు ఉన్న కాన్ఫిడెన్స్ వల్లే ఈ మూవీని ఇంత గ్రాండియర్‌గా, ఇంత హై బడ్జెట్‌‌లో తీయగలిగాం. ఈ క్రెడిట్ అంతా ఆయనదే.ఈ మూవీ కోసం మోహన్‌లాల్ గారు, నేను ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పని చేశాం. మార్చి 27న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి ఎంజాయ్ చేయండి. మూడో పార్ట్ చేసేలా సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..