Prabhas: మారుతి సినిమా కోసం ప్రభాస్ ఎంత రెమ్యునరేషన్ అందుకున్నాడో తెలుసా.. ఇది నిజంగా షాకింగ్ న్యూసే
ఈ సినిమాల్లో చాలా వరకు ఈ ఏడాదే రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. డార్లింగ్ లిస్ట్‌లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఆదిపురుష్. అన్ని అనుకున్నట్టుగా జరిగుంటే ప్రజెంట్ ఈ సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉండేది మూవీ టీమ్.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలను లైనప్ చేసి ఆయా సినిమా షూటింగ్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. తొలి పాన్ ఇండియా సూపర్ స్టార్‌గా ప్రూవ్ చేసుకున్న ప్రభాస్ కిట్టిలో చాలా సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాల్లో చాలా వరకు ఈ ఏడాదే రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. డార్లింగ్ లిస్ట్‌లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఆదిపురుష్. అన్ని అనుకున్నట్టుగా జరిగుంటే ప్రజెంట్ ఈ సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉండేది మూవీ టీమ్. కానీ టీజర్ రిలీజ్ తరువాత పరిస్థితులు తారుమారు కావటంతో సినిమా రిలీజ్ కూడా వాయిదా పడింది. టీజర్ మీద దారుణమైన ట్రోల్స్ వచ్చినా… ఇప్పటికీ మోస్ట్ అవెయిటెడ్ లిస్ట్‌లో కొనసాగుతుంది ఆదిపురుష్.అలాగే
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సలార్ సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. కేజీఎఫ్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ మీద మాస్ హిస్టీరియా క్రియేట్ చేసిన ప్రశాంత్… ప్రభాస్ లాంటి పాన్ ఇండియా కటౌట్‌ను తెర మీద ఎలా చూపించబోతున్నారన్న క్యూరియాసిటీ ఆడియన్స్‌తో పాటు ఇండస్ట్రీ జనాల్లోనూ కనిపిస్తోంది. రిలీజ్‌కు ఇంకా చాలా టైమున్నా… డార్లింగ్ లిస్ట్‌లో ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేస్తున్న మరో క్రేజీ మూవీ ప్రాజెక్ట్ కే. మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా 2024లో రిలీజ్‌కు రెడీ అవుతున్నా.. ఇప్పటి నుంచే ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేస్తోంది. వీటితో పాటే ప్రభాస్ మారుతి దర్శకత్వంలో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా హారర్ కామెడీ అని టాక్.
తాజాగా ఈ సినిమాకు ప్రభాస్ తీసుకున్న రెమ్యునరేషన్ గురించి ఒక టాక్ వైరల్ అవుతోంది. రాజా డీలాక్స్ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఒక రాజ్ మహల్ సెట్ ని కూడా వేసారు. కాగా ఈ సినిమా కోసం ప్రభాస్ ఊహించని విధంగా మారుతి సినిమా కోసం ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని తెలుస్తుంది. సినిమా సక్సెస్ బట్టి అందులో షేర్ ని రెమ్యునరేషన్ గా ఇవ్వమని నిర్మాతకి చెప్పినట్లు టాక్. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.