AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Avika Gor: మరో ఇంట్రెస్టింగ్ మూవీతో రానున్న చిన్నారి పెళ్లికూతురు.. పాప్‌కార్న్ సినిమా రిలీజ్ అయ్యేది అప్పుడే

అవికా, , సాయి రోన‌క్ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం ‘పాప్ కార్న్’. ఎం.ఎస్‌.చ‌ల‌ప‌తి రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ఆచార్య క్రియేష‌న్స్, అవికా స్క్రీన్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై భోగేంద్ర గుప్తా (నెపోలియ‌న్‌, మా ఊరి పొలిమేర చిత్రాల నిర్మాత‌) ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Avika Gor: మరో ఇంట్రెస్టింగ్ మూవీతో రానున్న చిన్నారి పెళ్లికూతురు.. పాప్‌కార్న్ సినిమా రిలీజ్ అయ్యేది అప్పుడే
Avika Gor
Rajeev Rayala
|

Updated on: Feb 09, 2023 | 10:10 AM

Share

అవికా గోర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉయ్యాలైన జంపాలైన సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ చిన్నది. తాజాగా ఈ బ్యూటీ నటిస్తోన్న సినిమా పాప్ కార్న్. అవికా, , సాయి రోన‌క్ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం ‘పాప్ కార్న్’. ఎం.ఎస్‌.చ‌ల‌ప‌తి రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ఆచార్య క్రియేష‌న్స్, అవికా స్క్రీన్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై భోగేంద్ర గుప్తా (నెపోలియ‌న్‌, మా ఊరి పొలిమేర చిత్రాల నిర్మాత‌) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హీరోయిన్ అవికా గోర్ ఈ చిత్రానికి స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌టం విశేషం. ముర‌ళి గంధం ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. ఫిబ్రవరి 10న సినిమాను గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.

పాప్ కార్న్ చిత్రానికి సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఈ సినిమా ఆద్యంతం వినోదభరితంగా ఉందని సెన్సార్ సభ్యులు ప్రశంసలు కురిపించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పాటలు, టీజర్, ట్రైలర్‌కు విశేషమైన స్పందన లభించిన సంగతి తెలిసిందే.

నాగ చైతన్య చేతులు మీదుగా రిలీజ్ చేయించిన మది విహంగమాయే పాట శ్రోతలను ఇట్టే ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఫిబ్రవరి 10న ఈ చిత్రం భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా ఈ సంద‌ర్భంగా చిత్ర స‌మ‌ర్ప‌కుడు ఎం.ఎస్‌.చ‌ల‌ప‌తి రాజు మాట్లాడుతూ ‘‘పాప్ కార్న్’ మూవీని ఫిబ్ర‌వ‌రి 10న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యులకు ఈ సినిమాను చూసి మెచ్చుకున్నారని, అన్ని ర‌కాల ఎమోష‌న్స్ ఉన్న సినిమాని ప్రశంసించారు’ అని అన్నారు.

సినిమాకు కో ప్రొడ్యూసర్‌గా వ్య‌వ‌హ‌రించిన అవికా గోర్ మాట్లాడుతూ .. ‘ఇది ఒక డిఫరెంట్ మూవీ అని సెన్సార్ సభ్యులు ప్రశంసించారు. కొత్త కాన్సెప్ట్ చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారనే న‌మ్మ‌కం ఉంది. ఫిబ్ర‌వ‌రి 10న పాప్ కార్న్‌తో సంద‌డి చేయ‌బోతున్నాం’ అని అన్నారు. హీరో సాయి రోనక్ మాట్లాడుతూ ‘సెన్సార్ సభ్యులకు సినిమా నచ్చింది. థియేటర్లో ఉన్న ఆడియెన్స్‌కు చివ‌రి 45 నిమిషాలైతే సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌గా ఉంటుంద’ని అన్నారు.

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!