దిల్ రాజైనా.. కరణ్ జోహారైనా.. వెయిట్ చేయాల్సిందే..!
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా ఇప్పుడు ఎటు చూసినా సాహో మూవీకి సంబంధించిన బజ్ మాత్రమే బాగా నడుస్తోంది. అంతగా సాహో మేనియా పట్టేసింది. ఆగష్టు 15న విడుదల సాహో విడుదల కానుంది. మరి ఆ తర్వాత ప్రభాస్ చేసే సినిమా ఏంటి..? ఇదే అందరిలో డౌట్. మరోవైపు ప్రభాస్ దీనికి పార్లర్‌గా మరో సినిమాను సైలెంట్‌గా నడిపిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. సాహోకి రెగ్యులర్ ఇంటర్‌వెల్స్ ఇస్తూ.. తన అప్ కమింగ్ మూవీ షూట్‌లో కూడా పాల్గొన్నట్లు […]
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా ఇప్పుడు ఎటు చూసినా సాహో మూవీకి సంబంధించిన బజ్ మాత్రమే బాగా నడుస్తోంది. అంతగా సాహో మేనియా పట్టేసింది. ఆగష్టు 15న విడుదల సాహో విడుదల కానుంది. మరి ఆ తర్వాత ప్రభాస్ చేసే సినిమా ఏంటి..? ఇదే అందరిలో డౌట్. మరోవైపు ప్రభాస్ దీనికి పార్లర్‌గా మరో సినిమాను సైలెంట్‌గా నడిపిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. సాహోకి రెగ్యులర్ ఇంటర్‌వెల్స్ ఇస్తూ.. తన అప్ కమింగ్ మూవీ షూట్‌లో కూడా పాల్గొన్నట్లు సమాచారం. రెండు ప్రాజెక్టుల్ని ఒకే సారి సమాంతరంగా నడిపించాడట. రాధాకృష్ణ డైరెక్షన్‌లో గోపికృష్ణ మూవీస్ యూవీ క్రియేషన్స్‌తో కలిసి తీస్తున్న ఈ మూవీకి సంబంధించి దాదాపు సగం షూటింగ్ పూర్తైంది. ఇందులో పూజాహెగ్డె హీరోయిన్.. ఇలా రెండు సినిమాలను లైన్‌లో పెట్టాడు ప్రభాస్.
అయితే ముందుగా సాహో విడుదలవుతోంది. ఇప్పుడు చేస్తున్న రెండు సినిమాలు సొంత బ్యానర్‌వే కావడంతో బయటినిర్మాతలకు అందని ద్రాక్ష పండులా మారాడు ప్రభాస్. డార్లింగ్‌తో సినిమా చేసే అదృష్టం దిల్ రాజుకు దొరికిందన్నది ఒక కాన్ఫిడెన్షియల్ న్యూస్. గతంలో ప్రభాస్‌తో మిస్టర్ పర్‌ఫెక్ట్, మున్నా సినిమాలు తీశారు దిల్‌రాజు కాకపోతే అప్పట్లో పాతిక కోట్లు ఉన్న ప్రభాస్ మార్కెట్ రేంజ్ ఇప్పుడు మినిమం రెండు వందల కోట్లకు చేరింది. సాహో హిట్ అయితే ఆ రేంజ్ ఇంకా పెరగొచ్చుని తెలుస్తోంది. అయితే దిల్‌రాజుకి కూడా పూర్తిగా మాటివ్వలేదట. కథ నచ్చితే మాత్రం చేస్తానన్నాడట. ఇంతకు ముందు బాలీవుడ్ అగ్రనిర్మాత కరణ్ జోహార్ కూడా ఇలాంటి బడా ఆఫరే ఇచ్చాడు. కాని ప్రభాస్ దాన్ని రిజెక్ట్ చేశాడు. సాహో సినిమా విడుదలైన తర్వాత అది వసూళ్లు చేసే దాన్ని బట్టి తన నెక్ట్స్ సినిమాలపై ఓ క్లారిటీకి వస్తాడని సమాచారం.