ఫుల్ ఫన్ లవ్‌తో.. మళ్లీ వచ్చేస్తున్నాడు..!

“గుండె జారీ గల్లంతయ్యిందే” లాంటి ఫుల్ ఎంటర్ టైనర్‌తో హిట్ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు కొండా విజయ్ కుమార్. అయితే ఆ సక్సెస్‌ను మాత్రం అలాగే కొనసాగించలేకపోయాడు. నాగచైతన్య పిలిచి మరీ ఆఫర్ ఇచ్చినా.. “ఒక లైలా కోసం” అంటూ ఫ్లాప్ చిత్రాన్ని తీశాడు. మళ్లీ చాలా గ్యాప్ తరువాత ఎట్టకేలకు రాజ్ తరుణ్ హీరోగా కె.కె. రాధామోహన్ నిర్మాణంలో ఓ సినిమా చేస్తున్నాడు. కాగా ఈ సినిమా కథ వెరీ ఇంట్రస్టింగ్ ప్లే‌తో సాగుతుందని […]

ఫుల్ ఫన్ లవ్‌తో.. మళ్లీ వచ్చేస్తున్నాడు..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 13, 2019 | 11:20 AM

“గుండె జారీ గల్లంతయ్యిందే” లాంటి ఫుల్ ఎంటర్ టైనర్‌తో హిట్ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు కొండా విజయ్ కుమార్. అయితే ఆ సక్సెస్‌ను మాత్రం అలాగే కొనసాగించలేకపోయాడు. నాగచైతన్య పిలిచి మరీ ఆఫర్ ఇచ్చినా.. “ఒక లైలా కోసం” అంటూ ఫ్లాప్ చిత్రాన్ని తీశాడు. మళ్లీ చాలా గ్యాప్ తరువాత ఎట్టకేలకు రాజ్ తరుణ్ హీరోగా కె.కె. రాధామోహన్ నిర్మాణంలో ఓ సినిమా చేస్తున్నాడు. కాగా ఈ సినిమా కథ వెరీ ఇంట్రస్టింగ్ ప్లే‌తో సాగుతుందని తెలుస్తోంది. ముఖ్యంగా లవ్ స్టోరీలో ఫుల్ ఫన్ ఉంటుందట. వెరీ యాక్టివ్‌గా ఉండే కుర్రాడు తన కంటే వయసులో పెద్దయిన ఓ అమ్మాయిని ఇష్టపడి.. అమ్మాయిని సొంతం చేసుకునే క్రమంలో జరిగే డ్రామా సినిమాలో చాలా బాగా చూపించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం ఆగష్టు నుంచి నాన్ స్టాప్‌గా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో నటించే నటీనటుల ఎంపిక జరుగుతోంది. కాగా, ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.