Prabhas: ఎట్టకేలకు పెళ్లిపై స్పందించిన ప్రభాస్.. అప్పుడే అనౌన్స్ చేస్తానంటూ..

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే ఠక్కున గుర్తొస్తాడు ప్రభాస్ (Prabhas). ఈ యంగ్ రెబల్ స్టార్ పెళ్లి గురించి అతని ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.

Prabhas: ఎట్టకేలకు పెళ్లిపై స్పందించిన ప్రభాస్.. అప్పుడే అనౌన్స్ చేస్తానంటూ..
Prabhas
Rajitha Chanti

|

Apr 15, 2022 | 1:44 PM

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే ఠక్కున గుర్తొస్తాడు ప్రభాస్ (Prabhas). ఈ యంగ్ రెబల్ స్టార్ పెళ్లి గురించి అతని ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్‏కు కాబోయే భార్య ఎవరు ?.. ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు ? లవ్ మార్యేజ్ ?…అరెంజ్ మ్యారేజ్ ? వంటి పలు రకాల ప్రశ్నలు సోషల్ మీడియాలో నిత్యం చక్కర్లు కొడుతుంటాయి. అభిమానులే కాదు.. ప్రభాస్ పెళ్లి కోసం మేము కూడా ఎదురుచూస్తున్నామంటూ ఇటీవల రాధేశ్యామ్ సినిమా ప్రమోషన్స్ సమయంలో అతని కుటుంబసభ్యులు చెప్పిన సంగతి తెలిసిందే. ప్రభాస్ పెదనాన్న ప్రభాస్ పిల్లలతో ఆడుకోవాలని ఉందంటూ తన మనసులోని మాటను బయటపెట్టేశారు కూడా. అయితే బాహుబలి అనంతరం పెళ్లి చేసుకుంటానని చెప్పిన ప్రభాస్.. ఇప్పటివరకు మళ్లీ తన పెళ్లిపై స్పందించలేదు. తాజాగా ఆంగ్ల పత్రిక ఇండియా టూడేకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మరోసారి తన పెళ్లి పై స్పందించాడు.

ప్రభాస్.. డైరెక్టర్ రాధా కృష్ణ కుమార్ కాంబోలో వచ్చిన రాధేశ్యామ్ సినిమా ఇటీవల విడుదలై సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. దాదాపు రూ. 450 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. రాధేశ్యామ్ సినిమా ఏప్రిల్ 24న మధ్యాహ్నం 12 గంటలకు జీ సినిమాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో ఇండియా టూడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తిక విషయాలను చెప్పుకొచ్చాడు. తాను ఎక్కడకు వెళ్లినా.. ప్రతిచోట తన పెళ్లి గురించి ఆడుగుతారని.. అందుకు మీరు ఎప్పుడైనా బాధపడ్డారా ? అని అడిగాడు యాంకర్. దీంతో ప్రభాస్ మాట్లాడుతూ.. “లేదు.. నా వివాహం గురించి ప్రేక్షకులు అడిగినప్పుడు నేను చిరాకుపడను. వారు నా పెళ్లి గురించి ఆందోళన పడుతున్నారని నేను అర్థం చేసుకుంటాను.. ఇది చాలా సాధారణ ప్రశ్న.. ఒకవేళ నేను వారి స్థానంలో ఉన్నా కూడా ఇలాగే ఆందోళన పడేవాడిని ” అంటూ చెప్పుకొచ్చాడు.

దీంతో… మీరు మీ పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి అని ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ? అని అడగ్గా.. ఈ ప్రశ్నకు సమాధానం దొరికినప్పుడు తప్పకుండా అనౌన్స్ చేస్తాను అంటూ నవ్వుతూ సమాధానమిచ్చాడు ప్రభాస్. డార్లింగ్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు.. స్పిరిట్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే, సలార్ సినిమాలతో బిజీ షెడ్యూల్ గడిపేస్తున్నాడు.

Also Read: suriya: తమిళ నూతన సంవత్సరం వేళ సరికొత్తగా సూర్య.. అభిమానులకు అలా విషెస్ చెబుతూ..

Simbu: ఆటో డ్రైవర్‏గా మారిన ఆ స్టార్ హీరో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోస్..

PM Kisan: రైతులకు అలర్ట్.. కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం.. పీఎం కిసాన్ పథకానికి ఇక వీరు అనర్హులు.. 

Sunny Leone: సన్నీలియోన్ ఫాన్స్‏కు బంపర్ ఆఫర్.. క్రేజీ ఐడియా.. కానీ కండిషన్స్ అప్లై..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu