Lambasingi Movie: బిగ్‌బాస్‌ ఫేమ్‌ దివి కొత్త సినిమా టైటిల్‌ ఖరారు.. స్వచ్ఛమైన ప్రేమ కథతో..

Lambasingi Movie: బిగ్‌బాస్‌ (Biggboss) రియాలిటీ షో ద్వారా ఎంతో మందికి పరిచయమైంది అందాల తార దివి వైద్య. అంతకు ముందు కొన్ని సినిమాల్లో గెస్ట్‌ రోల్‌లో నటించినా బిగ్‌బాస్‌ ఈ బ్యూటీకి ఎక్కడలేని క్రేజ్‌ తీసుకొచ్చింది. ఈ షో ద్వారా సంపాదించుకున్న...

Lambasingi Movie: బిగ్‌బాస్‌ ఫేమ్‌ దివి కొత్త సినిమా టైటిల్‌ ఖరారు.. స్వచ్ఛమైన ప్రేమ కథతో..
Lambasingi Moive
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 15, 2022 | 2:33 PM

Lambasingi Movie: బిగ్‌బాస్‌ (Biggboss) రియాలిటీ షో ద్వారా ఎంతో మందికి పరిచయమైంది అందాల తార దివి వైద్య. అంతకు ముందు కొన్ని సినిమాల్లో గెస్ట్‌ రోల్‌లో నటించినా బిగ్‌బాస్‌ ఈ బ్యూటీకి ఎక్కడలేని క్రేజ్‌ తీసుకొచ్చింది. ఈ షో ద్వారా సంపాదించుకున్న క్రేజ్‌తో దివి పలు సినిమా అవకాశాలను సైతం సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే తాజాగా కొత్త సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది. నవీన్‌ గాంధీ దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాకు ‘లంబసింగి’గా టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా ద్వారా భరత్‌ హీరోగా పరిచయమవుతున్నాడు.

స్వచ్ఛమైన ప్రేమ కథ అనే క్యాప్షన్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్‌డేట్ ఇచ్చారు. సినిమాలోని ‘నచ్చేసిందే.. నచ్చేసిందే’ అనే పాట ప్రోమోను విడుదల చేశారు. ఈ పాటను సింగర్ సిధ్‌ శ్రీరామ్‌ ఆలపించడం విశేషం. ఫుల్‌ సాంగ్‌ను శనివారం విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రోమో సాంగ్‌ వింటుంటే ఈ సాంగ్‌కు సిధ్‌ శ్రీరామ్‌ గత పాటలకు దక్కిన స్పందన లభించేలా కనిపిస్తోంది. ఇక ఈ సినిమాకు కె. బుజ్జి సినిమాటోగ్రాఫర్‌గా, కె విజయ్ వర్ధన్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.

Also Read: Railway News: రైల్వే ప్రయాణికులకి శుభవార్త.. దక్షిణ రైల్వే మధ్యలో నడిచే రైళ్లకి అదనపు కోచ్‌ల ఏర్పాటు..

US VISA: యూఎస్‌లో చదువుకోవాలనుకునే విద్యార్ధులకు గుడ్‌ న్యూస్‌.. వీసా స్లాట్లు పెంచే ఆలోచనల్లో అమెరికా..

KGF Chapter 2: ప్రశాంత్ నీల్ నమ్మకాన్ని అతడు వమ్ము చేయలేదు.. కేజీఎఫ్ 2 ఎలివేషన్స్ వెనక 19 ఏళ్ల కుర్రాడు..